Moviesమాఫియాడాన్లతో ఎఫైర్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్లు వీళ్లే..!

మాఫియాడాన్లతో ఎఫైర్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్లు వీళ్లే..!

హీరోయిన్లకు స్టార్ క్రిట‌ర్ల‌తో ఉన్న లింకుల గురించి మ‌నం కొన్ని ద‌శాబ్దాలుగా వింటునే ఉన్నాం. స్టార్ హీరోయిన్లు.. స్టార్ క్రికెటర్లతో ప్రేమలో పడటం, డేటింగ్ లు చేయటం.. పెళ్లిళ్లు చేసుకోవటం 1970వ దశకం నుంచి చూస్తున్నాం. ఈ క్రమంలోనే ముంబై మాఫియాను శాసించిన పెద్దడాన్లతోనూ, స్టార్ హీరోయిన్లు ఎఫైర్లు పెట్టుకొని డేటింగ్ లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. బాలీవుడ్ లో ఒక స్టార్ హీరోయిన్ అప్పట్లో ఒక వెలుగు వెలుగుతోందంటే ఆమెపై ఖచ్చితంగా ముంబై మాఫియా కన్నుపడేది. ఆమెను ఎలాగైనా తమ కంట్రోల్ లోకి తెచ్చుకునేందుకు మాఫియా లీడ‌ర్లు ప్రయత్నాలు చేసేవారు.

ముంబై మాఫియా ఒత్తిడి చేస్తే ఖ‌చ్చితంగా ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా వాళ్ళు చెప్పిన సినిమాలో.. చెప్పిన హీరోతో నటించేందుకు ఒప్పుకోవాల్సిందే. కొందరు హీరోయిన్లు మాఫియా నాయకుల బెదిరింపులకు తలొగ్గేవారు.. వారు చెప్పినట్టే ఆడేవారు. మరి కొందరు స్టార్ హీరోయిన్లు మాఫియా లీడర్లతో సీక్రెట్ గా ప్రేమయణాలు నడిపారు. ముంబైయి పేలుళ్లకు ముందు దావూద్ ఇబ్ర‌హీంతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మందాకిని చాలా క్లోజ్ గా ఉండేవారు. ఇప్పటికీ ఇంటర్నెట్లో సెర్చ్‌ చేస్తే వీళ్ళిద్దరు జంటగా ఉన్న ఫోటోలు బయటకు వస్తాయి.

మందాకిని అంటే 1980వ దశంలో బాలీవుడ్ ను త‌న అంద‌చందాల‌తో ఒక ఊపు ఊపేసింది. ఆమె తెలుగులో సూపర్ స్టార్ కృష్ణతో సింహాసనం మూవీలో కూడా నటించింది. ఏదేమైనా మందాకిని అందానికి దావూద్ ఇబ్రహీం పడిపోయాడు. వాళ్ళిద్దరూ సీక్రెట్ గా సహజీవనం కూడా చేశారు. అయితే ముంబై వరుస‌ పేలుళ్ల తర్వాత వీళ్ళ బంధానికిబ్రేక్ పడింది. దావూద్ తో బ్రేకప్ తర్వాత మందాకిని మరో వ్య‌క్తిని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది.

అలాగే తెలుగులో తాజ్‌మహల్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన మౌనిక బేడీ మరో మాఫియా డాన్ అబూసలేం ఎఫైర్ కూడా అప్పట్లో దేశవ్యాప్తంగా కూడా హాట్‌ టాపిక్ గా నిలిచింది. బాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసిన మౌనికబేడీ తెలుగులో చిరంజీవి హీరోగా వచ్చిన చూడాలని ఉంది సినిమాలో రామ చిలకమ్మా అనే పాటలో కూడా డాన్స్ చేసింది. ఆ తర్వాత అబుసలేంను సీక్రెట్ గా పెళ్లి చేసుకుని కెన్యా రాజధాని నైరోబిలో కొన్ని సంవత్సరాల పాటు గుట్టుగా కాపురం కూడాపెట్టింది.

ఎప్పుడైతే అబూసలేం పోలీసులకు చిక్కాడో మౌనిక కూడా జైలుకు వెళ్లి ఊచలు లెక్క‌ పెట్టింది. ఇక రెండు దశాబ్దాల క్రితం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా ఉన్న మాధురి దీక్షిత్ – కరిష్మా కపూర్ లాంటి స్టార్ హీరోయిన్లను సైతం మాఫియా తన గుప్పెట్లో పెట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది అన్న ప్రచారం కూడా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news