Moviesఎన్టీఆర్‌తో సమీరారెడ్డికి పెళ్ళి అన్న‌ ప్రచారం వెన‌క ఉంది ఎవ‌రు...!

ఎన్టీఆర్‌తో సమీరారెడ్డికి పెళ్ళి అన్న‌ ప్రచారం వెన‌క ఉంది ఎవ‌రు…!

సినిమా ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకి వెళ్ళని హీరోలు నందమూరి వారే అని గట్టిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ హీరోలు ఎప్పుడూ కూడా అటు దర్శక నిర్మాతలతోనూ ఇటు హీరోయిన్స్‌తోనూ ఎంతో ఎంతో కలుపుగోలుగా మర్యాదగా మెలుగుతుంటారు. వీరు ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే కొందరు యాంటీ ఫ్యాన్స్ మాత్రం పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయనే సామెత మాదిరిగా ఫాంలో ఫేంలో నేంలో ఉన్నవారిమీదే ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ చేయడం వార్తలు రాయడం చేస్తుంటారు.

అలా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మీద ఓ సినిమా సమయంలో పిచ్చి పచ్చి రూమర్స్ క్రియేట్ చేశారు. జనాలలో చాలామందికి ఆసక్తికరమైన వార్తలు ఏంటో అందరికీ తెలిసిందే. మన ఇంట్లో చెత్త గురించి పట్టించుకోకుండా పక్కింట్లో ఉన్న చెత్త గురించే మాట్లాడుతుంటారు అనే సినిమా వాళ్ళ మీద పుకార్లు పుట్టించడం…పచ్చి గాసిప్పులు క్రియేట్ చేయడం ఎంత సులభమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే క్రియేట్ అయిన చెత్త వార్త ఎన్.టి.ఆర్ హీరోయిన్ సమీరా రెడ్డిని ప్రేమిస్తున్నాడని..డేటింగ్‌లో ఉన్నాడని మోత మోగించారు.

ఎన్.టి.ఆర్, సమీరా రెడ్డి కలిసి అశోక్ సినిమాలో నటించారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో హీరోహీరోయిన్ అందరి మాదిరిగానే కాస్త క్లోజ్‌గా కనిపించారు. డాన్సుల పరంగా ఇద్దరూ సినిమాలో అదరగొట్టారు. అప్పట్లో తారక్ డాన్స్ కి మ్యాచ్ అయిన హీరోయిన్ సమీరా రెడ్డి. సాంగ్స్‌లో కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇవన్నీ చూసి కొందరు పులిహోర కలిపేసి గాసిప్పులు క్రియేట్ చేశారు. ఇంకా కొందరు మరీ అతి ఉత్సాహంతో ఇద్దరు పెళ్ళి కూడా చేసుకున్నారని న్యూస్ స్ప్రెడ్ చేశారు.

ఇదే సమీరా రెడ్డి మెగాస్టార్ చిరంజీవి సరసన జై చిరంజీవ సినిమాలో నటించింది. ఇందులో నటించినప్పుడు చిరంజీవితో డేటింగ్ అని రాయలేదు. కానీ, తారక్‌తో మాత్రం ముడిపెట్టి రాసి నందమూరి అభిమానులతో తిట్టించుకున్నారు. నిజం నిప్పులాంటిది. రూమర్స్‌ను కాల్చి బూడిద చేయడం ఎంతసేపు. తారక్, సమీరా రెడ్డిల గురించి వచ్చిన వార్తలు కూడా అలాగే, అతికొద్దిరోజుల్లోనే బూడదైపోయాయి

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news