Moviesమాజీ భార్య‌, హీరోయిన్ ఎస్తేర్‌ను టార్గెట్ చేస్తూ రెండో పెళ్లిపై క్లారిటీ...

మాజీ భార్య‌, హీరోయిన్ ఎస్తేర్‌ను టార్గెట్ చేస్తూ రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నోయ‌ల్‌…!

సింగ‌ర్ నోయ‌ల్ తెలుగునాట బాగా పాపుల‌ర్‌. సింగ‌ర్ మంచి ఫేం ఉన్న నోయ‌ల్ చేసే షోల‌కు మంచి క్రేజ్ ఉంటుంది. నోయ‌ల్ పాడే పాట‌లు, పాప్ సాంగ్స్ కూడా అంతే పాపుల‌ర్‌. న‌టుడిగాను మంచి గుర్తింపే ఉన్న నోయ‌ల్ భీమ‌వ‌రం బుల్లోడు హీరోయిన్ ఎస్తేర్‌ను ప్రేమ‌వివాహం చేసుకున్నాడు. అయితే యేడాదిలోపే మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో వీరిద్ద‌రు విడిపోయారు. విడాకుల త‌ర్వాత నోయ‌ల్ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి మ‌ధ్య‌లోనే నిష్క్ర‌మించినా మ‌రింత గుర్తింపు తెచ్చుకున్నాడు.

విడాకుల త‌ర్వాత నోయ‌ల్ ఎప్పుడూ త‌న మాజీ భార్య ఎస్తేర్ గురించి ఎక్క‌డా నెగిటివ్‌గా కామెంట్లు చేయ‌లేదు. అయితే ఎస్తేర్ మాత్రం నోయ‌ల్‌పై ఘాటుగానే కామెంట్లు చేసింది. అత‌డు అన్నీ అబ‌ద్ధాలే చెపుతాడ‌ని.. మ‌నం వేసే ఒక ప్ర‌శ్న‌కే నోయ‌ల్ ర‌క‌ర‌కాల ఆన్స‌ర్లు చెపుతాడ‌ని… పెళ్ల‌య్యాక ఆరు నెల‌ల త‌ర్వాత త‌న‌కు అత‌డితో జీవితాంతం క‌లిసి ఉండ‌లేన‌న్న విష‌యం అర్థ‌మైంద‌ని.. అందుకే తాను విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసింది.

విడాకుల త‌ర్వాత ఎవ‌రి జీవితంలో వారు సెటిల్ అయిపోయారు. ఎస్తేర్ సినిమాలు చేసుకుంటోంది. నోయ‌ల్ పాట‌లు పాడుకుంటూ.. న‌టుడిగా కొన‌సాగుతున్నాడు. ఈ క్ర‌మంలోనే తాజా ఇంట‌ర్వ్యూలో నోయ‌ల్ త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి ఎట్ట‌కేల‌కు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌న మొద‌టి పెళ్లి గురించి మాట్లాడుతూ ఒక జంట‌కు పెళ్లి జ‌రిగింది అంటే రెండు కుటుంబాలు ఎంతో ఎఫ‌ర్ట్ పెట్టాలి.. అయితే నా జీవితంలో నుంచి వెళ్లిపోయిన వారి గురించి తాను బాధ‌ప‌డ‌ను.. ప్ర‌స్తుతం తాను ఎంతో హ్యాపీగా ఉన్నాను అని చెప్పారు.

ఇక కొన్ని సంఘ‌ట‌న‌లు త‌న‌కు ఎప్పుడు అయినా గుర్తుకు వ‌చ్చినా హ్యాపీగానే ఉంటాన‌ని… ప‌రోక్షంగా త‌న మాజీ భార్య ఎస్తేర్‌ను టార్గెట్ చేశారు. ఇక త‌న రెండో పెళ్లి గురించి కూడా నోయ‌ల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లే చేశారు. చాలా మంది త‌న రెండో పెళ్లి గురించి అడుగుతున్నారు అని… ఓ సారి మ‌న శ‌రీరంలో ఏదైనా ఎముక విరిగితే మ‌రోసారి విర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటాం… అలా రెండో పెళ్లి అనేది కాస్త ఆల‌స్యం అవుతుంద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం నోయ‌ల్ చేసిన కామెంట్లు బాగా వైర‌ల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news