Moviesఅపార్ట్‌మెంట్లో చైతు - స‌మంత కాపురం గుట్టు విప్పిన సీనియ‌ర్ హీరో......

అపార్ట్‌మెంట్లో చైతు – స‌మంత కాపురం గుట్టు విప్పిన సీనియ‌ర్ హీరో… ఉద‌యం ఏం చేసేవారంటే..!

అక్కినేని నాగచైతన్య – సమంత ఈ జంట గురించి ప‌దేళ్లుగా ఎన్నో వార్త‌లు చూస్తూనే ఉంటున్నాం. వీరు ప్రేమ‌లో ఉన్నా వార్తే.. పెళ్లికి ముందే యేడాది కాలంగా ఏం చేసినా వార్తే.. పెళ్లి జీవితం, విహార యాత్ర‌లు, వీరి సినిమాలు, విడాకులు.. ఇప్పుడు విడాకుల త‌ర్వాత కూడా ఇలా ఏం చేసినా పెద్ద హాట్ టాపిక్‌గానే ఉంటోంది. విడాకుల‌కు కొద్ది రోజుల‌ ముందే వీరు మ‌జిలీ సినిమా చేశారు. హిట్ అయ్యింది.

స‌డెన్‌గా నాలుగు నెల‌ల్లోనే వీరిమ‌ధ్య స్ప‌ర్థ‌లు పెరిగిపోయి విడాకులు తీసుకున్నారు. వీరి విడాకులు తీసుకుని 9 నెల‌లు అవుతున్నా ఏదో ఒక వార్త బ‌య‌ట‌కు వ‌స్తూనే ఉంటోంది. తాజాగా వీరి దాంప‌త్య జీవితం, విడాకుల‌పై సీనియ‌ర్ న‌టుడు ముర‌ళీమోహ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. నాగ‌చైత‌న్య‌కు ముర‌ళీ మోహ‌న్ అపార్ట్‌మెంట్లో పైన ఫ్యామిలీ కోసం క‌ట్టుకున్న మూడు ప్లాట్స్ న‌చ్చాయ‌ట‌. చైతు రిక్వెస్ట్ చేసినా ముర‌ళీ మోహ‌న్ నో చెప్పేశాడ‌ట‌.

ఆ మూడు ప్లాట్స్ కోస‌మే స‌ప‌రేట్‌గా జిమ్‌, స్విమ్మింగ్ ఫూల్ కూడా ఉంటాయ‌ట‌. ఈ మూడు ప్లాట్స్‌లో ముర‌ళీ మోహ‌న్‌, ఆయ‌న కుమారుడు, ఆయ‌న సోద‌రుడు మాత్ర‌మే ఉండేవార‌ట‌. అయితే నాగార్జున ముర‌ళీమోహ‌న్‌కు స్వ‌యంగా ఫోన్ చేసి మా వాడికి ఏవీ ఓ ప‌ట్టాన న‌చ్చ‌వు.. మీ ప్లాట్స్ బాగున్నాయ‌ని చెప్ప‌డంతో చివ‌ర‌కు ముర‌ళీమోహ‌న్ త‌న‌యుడి ఫ్లాట్‌ను చైతుకు ఇచ్చార‌ట‌. చైతు పెళ్ల‌య్యాక కూడా స‌మంత‌తో అందులోనే కాపురం పెట్టాడ‌ట‌.

ఇక చైతు – స‌మంత అందులో ఉన్న‌న్ని రోజులు చాలా ఆప్యాయ‌త‌తో ఉండేవార‌ట‌. వాళ్లింట్లో ఏం జ‌రిగినా ముర‌ళీమోహ‌న్‌కు సౌండ్ కూడా వినిపిస్తుంద‌ట‌. అయితే చిన్న స్పూన్ కింద‌ప‌డిన సౌండ్ కూడా వ‌చ్చేదే కాద‌ట‌. స్టార్ హీరో, హీరోలుగా ఉన్న ఆ ఇద్ద‌రు స‌హ‌జంగానే ఫ్రెండ్స్‌ను తీసుకువ‌చ్చి పార్టీలు చేసుకుని.. నానా గోల చేస్తార‌ని.. కాని వారు ఏ రోజూ అలా చేయ‌లేద‌ని చెప్పారు.

ప్ర‌తి రోజు ఉద‌యం లేచి స‌మంత జిమ్ చేసేద‌ని.. చైతు – స‌మంత క‌లిసి బ‌య‌ట వాకింగ్ ప్లేస్‌లో కొద్దిసేపు న‌డిచేవార‌ట‌. ఎప్పుడూ కూడా చ‌క్క‌గా మాట్లాడుకుంటూ ఎంతో అన్యోన్య‌త‌తో ఉండేవార‌ని.. వారి మ‌ధ్య విబేధాలు ఉన్న‌ట్టు తాను ఎప్పుడూ చూడ‌లేద‌ని ఆయ‌న తెలిపారు. ఒక రోజు త‌న ప‌నిమనిషి వ‌చ్చి వాళ్లు విడిపోతున్నారు.. చైతు రూమ్ ఖాళీ చేసి వెళ్లిపోయాడు.. హోట‌ల్లో ఉంటున్నాడ‌ని చెప్పేవ‌ర‌కు విష‌యం త‌న‌కు తెలియ‌ద‌న్నారు.

క‌నీసం ఈ విష‌యం ముందు తెలిసి ఉంటే నాగార్జున‌తో మాట్లాడ‌డానికి అయినా ఛాన్స్ ఉండేద‌ని.. ఎంతో క‌లిసిమెలిసి ఉండే వాళ్లిద్ద‌రు ఆ నిర్ణ‌యం ఎందుకు ? తీసుకున్నారో ? త‌న‌కు ఇప్ప‌ట‌కీ అర్థం కాద‌ని ముర‌ళీ మోహ‌న్ తెలిపారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news