Movies"The Warrior" ఫస్ట్ డే కలెక్షన్స్..రామ్‌కు రాడ్ దింపేసారుగా.!!

“The Warrior” ఫస్ట్ డే కలెక్షన్స్..రామ్‌కు రాడ్ దింపేసారుగా.!!

పాపం..రామ్ ఏదో అనుకుంటే మరేదో జరిగింది అంటున్నారు నెటిజన్స్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్..లింగుస్వామీ డైరెక్షన్ లో అందాల తార కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన సినిమా “ది వారియర్”. భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ లో విలన్ గా ఆది పినిశెట్టి నటించారు. టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పోలీస్ ఆఫిసర్ గా నటించి జనలాకు పూనకాలు తెప్పించిన ఈ సినిమా.. బాక్స్ ఆఫిస్ వద్ద మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది.

మొదటి నుండి సినిమా పై భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్న అభిమానులకు లింగుస్వామీ రాడ్ దింపేశాడు అన్న కామెంట్స్ వినిపించాయి. గత సినిమాలు చూసి లింగుస్వామీ గురించి ఏదో ఎక్స్ పెక్ట్ చేసి ధియేటర్స్ కు వెళ్లిన జనాలు.. అస్సలు ఈ సినిమా తీసింది ఆయననేనా..అనే డౌట్లు వ్యక్తం చేస్తున్నారు . అంత డిజాస్టర్ అయ్యింది సినిమా అంటూ సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

సినిమా మొత్తానికి రామ్ యాక్షన్ సీన్స్ తప్పిస్తే..మిగిలిన షాట్స్ అన్ని ఫ్లాప్ అయ్యాయి అంటున్నారు సినిమా చూసిన జనాలు. ఇన్ని నెగిటీవ్ కామెంట్స్ మూటకట్టుకున్న వారియర్ కలెక్షన్స్ పరంగా కూడా అభిమానులను నిరాశ పరిచింది. ఫస్ట్ డే ది వారియర్ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద దారుణ కలెక్షన్స్ నమోదు చేసింది. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ‘ది వారియర్’ సినిమా మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 7.2 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.ఏపీ + తెలంగాణలో మొదటి రోజు కలెక్షన్స్ గానూ 3.07 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన్నట్లు తెలుస్తుంది. ఇక అదే గ్రాస్ పరంగా మనం చూసుకుంటే.. 4.02 కోట్లు వచ్చాయి.

కాగా, ఏరియా వారిల గా కలెకషన్లు చూస్తే.. నైజాం 0.82 కోట్లు,సీడెడ్ 0.39 కోట్లు,ఉత్తరాంధ్ర 0.32 కోట్లు, ఈస్ట్ 0.13 కోట్లు,వెస్ట్ 0.09 కోట్లు,గుంటూరు 0.12 కోట్లు,కృష్ణా 0.13 కోట్లు.నెల్లూరు 0.07 కోట్లు నమోదు చేసింది. ఈ చిత్రానికి రూ. 18.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినా బ్రేక్ ఈవేన్ అవ్వడం కష్టమే అంటున్నారు సినీ పండితులు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు మరో రూ. 16.23 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉన్నట్లు తెలుస్తుంది.నిజానికి మనం రామ్ గత సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే..సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ బాగానే వచ్చాయి. కానీ, ఈ సినిమా కి ఎందుకో పూర్తి రివర్స్ లో కలెక్షన్స్ ఉన్నాయి అంటున్నారు రామ్ అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news