Moviesబాల‌య్య అన్‌స్టాప‌బుల్ 2కు కొత్త డైరెక్ట‌ర్‌... ఆ ముగ్గురు స్టార్ల‌తో న‌ట‌సింహం...

బాల‌య్య అన్‌స్టాప‌బుల్ 2కు కొత్త డైరెక్ట‌ర్‌… ఆ ముగ్గురు స్టార్ల‌తో న‌ట‌సింహం ర‌చ్చే…!

తెలుగు ప్రేక్ష‌కులు నంద‌మూరి బాల‌కృష్ణ‌ను ఆహా అన్‌స్టాప‌బుల్ షోలో స‌రికొత్త‌గా చూశారు. అస‌లు బాల‌య్య‌లో ఈ యాంగిల్ ఉందా ? అని అంద‌రూ షాక్ అయిపోయారు. బాల‌య్య అంటేనే కొంద‌రు సినీ ల‌వ‌ర్స్‌తో పాటు ఆయ‌న్ను వ్యతిరేకించే కొంద‌రు హీరోల అభిమానుల్లోనూ ఆయ‌న‌కు కోపం ఎక్కువ‌.. అన్న నెగిటివ్ థింకింగ్ ఉండిపోయింది. వారిలో ఉన్న ఆ థింకింగ్‌ను పూర్తిగా మార్చేసింది అన్‌స్టాప‌బుల్ షో.

ఇంకా చెప్పాలంటే సోష‌ల్ మీడియాలో అఖండ‌కు ముందు వ‌ర‌కు బాల‌య్య అంటేనే విప‌రీత‌మైన నెగిటివిటి.. దీనికి తోడు భారీ ఎత్తున ట్రోలింగ్‌లు న‌డిచేవి. అస‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియా ఓపెన్ చేస్తేనే బాల‌య్యకు పాజిటివ్‌గా లైకులు, కామెంట్ల వ‌ర్షం కురుస్తోంది. నిజం చెప్పాలంటే అఖండ స‌క్సెస్ వెన‌క అన్‌స్టాప‌బుల్ ద్వారా బాల‌య్య‌కు వ‌చ్చిన క్రేజ్ కూడా ఓ కార‌ణం.

అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే ఫ‌స్ట్ సీజ‌న్లో వ‌చ్చిన అన్ని ఎపిసోడ్లు కూడా తిరుగులేని బ్లాక్‌బ‌స్ట‌ర్లు అయ్యాయి. అల్లు అర‌వింద్ బాల‌య్య‌పై పెట్టుకున్న న‌మ్మ‌కం నూటికి రెండొంద‌లు శాతం ఫ్రూవ్ చేసి చూపించాడు. ఈ షో దెబ్బ‌కు ఆహా ఓటీటీ ఎక్క‌డికో వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు అన్‌స్టాప‌బుల్ షో రెండో సీజ‌న్‌కు ముహూర్తం ఖ‌రార‌వుతోంది. ఆహా అధికారిక ప్ర‌క‌ట‌న ఇచ్చినా ఇంకా డేట్ ఫిక్స్ కాక‌పోవ‌డంతో ఇప్పుడు అంద‌రూ దీని కోసం వెయిట్ చేస్తున్నారు.

ఇక ఫ‌స్ట్ సీజ‌న్‌కు బ్యాక్ ఎండ్‌లో అంతా రైట‌ర్‌, డైరెక్ట‌ర్ బీవీఎస్ ర‌వి ద‌గ్గ‌రుండీ చేసుకున్నారు. ఇప్పుడు రెండో సీజ‌న్‌కు ర‌వి ప్లేస్‌లో మ‌రో యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌ను తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌శాంత్ వ‌ర్మ ఆధ్వ‌ర్యంలో ఇప్ప‌టికే రెండు ప్రోమోలు కూడా రెడీ చేస్తున్నార‌ట‌. బాల‌య్య – మ‌లినేని గోపీ సినిమా రిలీజ్ టైంకు కాస్త ముందుగా రెండో సీజ‌న్ ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌.

ఈ రెండో సీజ‌న్లో ఫ‌స్ట్ ఎపిసోడ్ గెస్ట్ మెగాస్టార్ చిరంజీవే అన్న‌ట్టుగా ఆహా వ‌ర్గాలు చెపుతున్నాయి. ఇక నాగార్జున‌, ఎన్టీఆర్‌ల‌లో ఖ‌చ్చితంగా ఏదో ఒక గెస్ట్‌ను తీసుకు రావాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రో గెస్ట్‌గా సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ పేరు ఎప్పుడో ఖ‌రారైంది. ఏదేమైనా సెకండ్ సీజ‌న్ ఎపిసోడ్ల‌ను కూడా ఓ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు. బాల‌య్య ర‌చ్చ ఈ సారి కూడా మామూలుగా ఉండేలా లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news