Movies"నాకు ఉన్న ఏకైక కోరిక అదే"..మనసులోని మాటబయటపెట్టిన కృతి శెట్టి..!!

“నాకు ఉన్న ఏకైక కోరిక అదే”..మనసులోని మాటబయటపెట్టిన కృతి శెట్టి..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలుతున్న కన్నడ బ్యూటీ కృతిశెట్టి . ఒక్కటి అంటే ఒక్క చిత్రంతో తన పేరు ను పాపులర్ హీరోయిన్ల లిస్ట్ ల ల్లోకి చేర్చుకుంది ఈ బ్యూటి. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరో గా నటించిన ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ..ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమా చేసే స్దాయికి ఎదిగిపోయింది.

ప్రజెంట్ తమిళ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్ లో..రామ్ హీరోగా, కృతిశెట్టి హీరోయిన్ గా నటించిన చిత్రం “ది వారియర్”. ఈ సినిమా జూలై 14 న ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా..కృతి శెట్టి ఓ ప్రముఖ ఛానెల్ కు ఇంటర్వ్యు ఇచ్చింది. ఈ సంధర్భంగా కృతి తన కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంది.

కృతి మాట్లాడుతూ..” లింగు స్వామి గారి డైరెక్షన్ లో నటించడం చాలా గర్వంగా ఉంది. ఆయన అమ్మకు ఫోన్‌ చేశారని అమ్మ చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ‘ది వారియర్‌’ కథ చాలా ఎగ్జైట్‌ గా ఉంటుంది. ఈ సినిమా లో నేను మీకు విజిల్ మహాలక్ష్మి గా కనిపిస్తాను..చాలా అల్లరి పిల్ల లా కనిపిస్తాను..నా ఓరిజినల్ క్యారెక్టర్ కి పూర్తి వ్యతిరేకం.. ఈ కధ విన్నప్పుడు నాకు చాలా కొత్త గా అనిపించింది. అందుకే ఓకే చేశా.. ఇలాంటి రోల్స్ నే చేయాలని ఏం గిరిగిసి పెట్టుకోను..కానీ, ఎప్పటి నుండో యాక్షన్ సినిమా లో నటించాలని ఉంది. ఇప్పుడే కాదు..ఇంకొంచెం టైం పొడుతుంది..” అంటూ తన డ్రీమ్ రోల్ గురించి బయటపెట్టింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news