Moviesబిగ్ షాకింగ్: నరేష్ తో సీక్రేట్ రిలేషన్ షిప్.. పవిత్రా...

బిగ్ షాకింగ్: నరేష్ తో సీక్రేట్ రిలేషన్ షిప్.. పవిత్రా లోకేష్‌కు భారీ ఝలక్ ఇచ్చిన టాలీవుడ్..?

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు న‌రేష్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన నోటి దూకుడుతో ఇండస్ట్రీలో ఎప్పుడు హాట్ టాపిక్ గానే ట్రోల్ అవుతుంటారు. అయితే, గత కొన్ని రోజుల నుండి నరేష్ నాలుగో పెళ్ళి మ్యాటర్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. నరేస్గ్ మ‌రో సీనియ‌ర్ న‌టి పవిత్రా లోకేష్ తో సహజీవనం చేస్తున్నారు అంటూ వార్తలు గుప్పుమన్నాయి.

వీటి పై వాళ్ళు కూడా స్పందిస్తూ..యస్, మేము లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నాం అంటూ ఒప్పేసుకున్నారు. దీంతో అసలు కధ మొదలైంది. అప్పటి నుంచి వీళ్లిద్దరి పేర్లు సోష‌ల్ మీడియా మార్మోగిపోతోంది. న‌రేష్‌కు ఇప్ప‌టికే మూడు పెళ్లిళ్లు జ‌రిగాయి.

మూడో భార్య ర‌మ్య ర‌ఘుప‌తితో అధికారికంగా విడాకులు ఇంకా రాలేదు. మరి నరేష్ ఇలా నాలుగో పెళ్లికి ఎలా సిద్ధపడ్డారో తెలియడం లేదు. ఈ మధ్య పవిత్రా, నరేష్..బయటపడటంతో..ఆయన మూడో భార్య..రమ్య రఘుపతి..చెప్పుతో కొట్టడానికి ట్రై చేసింది. ఆ టైంలో నరేష్ చేసిన చేషటలు..మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.

అయితే, తాజాగా పవిత్రకు టాలీవుడ్ నుండి బిగ్ షాక్ తగ్గిలిన్నట్లు తెలుస్తుంది. తల్లి పాత్ర అంటే టక్కున గుర్తు వచ్చే పవిత్ర ఇలాంటి రహస్య రిలేషన్  నడుపుతుండటంతో .. ఆమె ఇప్పటికే కమిట్ అయిన రెండు బడా తెలుగు ప్రాజెక్ట్స్ నుండి తప్పించిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా మంచి పీక్స్ లో ఉన్న పవిత్రా కెరీర్ కి ఇది భారీ ఎదురుదెబ్బే అంటున్నారు సినీ విశ్లేషకులు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news