Moviesవావ్: ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు..22 ఏళ్ల తరువాత చిరు క్రేజీ కాంబో.. ఆ...

వావ్: ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు..22 ఏళ్ల తరువాత చిరు క్రేజీ కాంబో.. ఆ హీరో తో కలపబోతున్న అందాలతార..!!

సినీ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్స్ చాలా బాగుంటాయి. సినిమా హిట్ అయినా కాకపోయినా.. తెర పై వాళ్లు కలిసి నటిస్తుంటే..సూపర్బ్ గా ఉంటాయి. అలా అప్పుడెప్పుడో 2000 లో అన్నయ్య సినిమాలో కలిసి నటించారు రవితేజ..చిరంజీవి. ఆ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమా లో అన్నయ్య క్యారెక్టర్ లో చిరంజీవి..తమ్ముడు క్యారెక్టర్ రవి తేజ అలాగే హీరో వెంకట్ చాలా బాగా నటించారు.

ఆ సినిమా తరువాత రవితేజ, చిరంజీవి కలిసి మళ్ళీ అలా ఫుల్ లెంత్ లో నటించలేదు. శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో ఒక్క పాటలో అలా మెరిశాడు తప్పిస్తే..లాంగ్ డ్యూరేషన్ రోల్ కాదు అది. ఇక ఇన్నాళ్లకు అంటే దాదాపు 22 ఏళ్ళ తరువాత మళ్ళీ క్రేజీ కాంబో సెట్ చేశాడు డైరెక్టర్ బాబీ. మెగాస్టార్ చిరంజీవి బాబి దర్శకత్వంలో 154వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి “వాల్తేరు వీరయ్య” అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా సినిమా పోస్టర్ రిలీజ్ చేసి అభిమానుల్లో కొత్త ఉత్సాహాని పెంచారు మేకర్స్.

అయితే సినిమాలో ప్రారంభంలోనే రవితేజ కూడా చిరంజీవితో పాటు నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇటీవలే రవితేజ షూటింగ్ షెడ్యూల్ జాయిన్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా వదిలారు. కాగా, ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ బజ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో రవితేజ పాత్ర, అతడు చిరంజీవితో చేతులు కలిపే సీన్స్‌కు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో రవితేజ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడని..ఇది వరకు ఎప్పుడు చూడని రవితేజ ని చూస్తారని చెప్పుకొస్తున్నారు మేకర్స్. ఆయన పాత్ర సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఎంట్రీ వస్తుందని తెలుస్తోంది. అలాగే, ఈ సినిమాలో రవితేజ మదర్ గా ఒకప్పటి స్టార్ హీరోయిన్ సుమలత నటిస్తుందట. రవి తేజ తో ఆయన చెయ్యి చిరంజీవితో కలిపేది సుమలతనేనట. ముగ్గురు మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్..సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి అంటున్నారు మేకర్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news