Moviesనడి రోడ్డు పై అండర్ వేర్ లో విజయ్ దేవరకొండ...హ్యాట్సాఫ్ రౌడీ...

నడి రోడ్డు పై అండర్ వేర్ లో విజయ్ దేవరకొండ…హ్యాట్సాఫ్ రౌడీ హీరో..!!..!!

రౌడి హీరో విజయ్ దేవరకొండ..క్రేజ్ అంటే మామూలుగా ఉండదు . ధియేటర్స్ లో విజిల్స్ వేస్తే టాప్ లేచిపోతాది . ఇప్పటికే అర్జున్ రెడ్డి సినిమా తో సంచలనం సృష్టించిన ఈ రౌడీ హీరో..ఇప్పుడు తాజాగా లైగర్ సినిమాతో మరో..బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ అయ్యాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు బాలీవుడ్ కళ్లు అన్నీ ఈ సినిమా పైనే ఉన్నాయి.

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా – బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా..పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న మూవీ లైగర్. ఈ సినిమా టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనదైన స్టైల్లో విభిన్న రీతిలో తెరకెక్కిస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా వ‌స్తోన్న ఈ సినిమాను ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్‌, పూరి క‌నెక్ట్స్ ప‌తాకంపై క‌ర‌ణ్ జోహ‌ర్‌-పూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. అందులో స్టార్ హీరో విజయ్ న్యూడ్ గా కనిపిస్తాడు. కేవలం ఒక్క ఫూల బొకే అడ్డు పెట్టుకుని..ఒంటి మీద నూలు పోగుకూడా లేకుండా నిల్చున్న పోస్టర్ సంచలనంగా మారింది. రిలీజ్ అయిన 24 గంటల్లు కాకముందే.. ఇన్‌స్టాగ్రామ్‌లో వేగంగా 1.3 మిలియన్ లైక్స్‌ వచ్చాయి. ఈ ఘనత సాధించిన తొలి పోస్టర్ ఇదే కావడం మరింత విశేషం. అయితే, ఇంత పెద్ద స్టార్ హీరో ఇలా న్యూడ్ పోస్టర్ కి ఫోజులివ్వడాని చాలా మంది తప్పుబడుతున్నారు. స్టార్ హీరోయిన్లు అయితే ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.

ఈ మూవీ ఆగస్ట్‌ 25న వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ‘లైగర్’ మూవీ ట్రైలర్ లాంచ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని సుదర్శన్‌ 35 ఎమ్‌ఎమ్‌ థియేటర్‌లో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు సుమారు 75 అడుగుల విజయ్ దేవరకొండ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు అభిమానులు . జాతియ జెండాను కప్పుకున్న బాక్సర్‌గా విజయ్ దేవరకొండ కటౌట్‌ చాలా బాగుంది. ఈ కటౌట్ లో విజయ్ అండర్ వేర్ వేసుకుని జాతియ జెండాను కప్పుకున్న బాక్సర్‌గా మనకి కనిపిస్తాడు. దీంతో విజయ్ గట్స్ కి అందరు హ్యాట్ సాఫ్ చెప్పుతున్నారు. ఖచ్చితంగా సినిమా భారీ హిట్ అవుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news