Moviesఆ హీరోయిన్‌పై త్రివిక్ర‌మ్‌కు అంత స్పెష‌ల్ ఇంట్ర‌స్ట్ ఏంట‌బ్బా... ఇదే హాట్...

ఆ హీరోయిన్‌పై త్రివిక్ర‌మ్‌కు అంత స్పెష‌ల్ ఇంట్ర‌స్ట్ ఏంట‌బ్బా… ఇదే హాట్ టాపిక్‌..!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌కు హీరోయిన్ల‌ను రిపీట్ చేయ‌డం కామ‌న్‌. జ‌ల్సా, జులాయి సినిమాల్లో ఇలియానాను రిపీట్ చేశాడు. త‌ర్వాత స‌మంత‌ను ఏకంగా మూడు సినిమాల్లో రిపీట్ చేశాడు. అత్తారింటికి దారేది – స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి – ఆహా సినిమాల్లో ఆమెను వ‌రుస‌గా పెట్టుకున్నాడు. ఇక ఇప్పుడు పూజా హెగ్డే వంతు వ‌చ్చింది. ఆర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ – అల వైకుంఠ‌పురంలో సినిమాల్లో పూజాయే హీరోయిన్‌. ఇప్పుడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు – త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌స్తోన్న సినిమాలోనూ పూజాయే హీరోయిన్‌.

స‌మంత‌కు వ‌రుస‌గా మూడు ఛాన్సులు అయిపోయాయి. ఆమెను ప‌క్క‌న పెట్టేసి ఇప్పుడు పూజా హెగ్డేను వ‌రుస‌గా తిప్పుతున్నాడు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు త్రివిక్ర‌మ్ మ‌రో యంగ్ హీరోయిన్‌పై స్పెష‌ల్ ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నాడ‌న్న వార్త‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ యంగ్ హీరోయిన్ ఎవ‌రో కాదు మ‌ళ‌యాళ భాయ సంయుక్త మీన‌న్‌.

సంయుక్త మీన‌న్‌పై త్రివిక్ర‌మ్ ముందు నుంచే కాస్త ఇంట్ర‌స్ట్ చూపిస్తున్న‌ట్టుగా ఉంది. త్రివిక్ర‌మ్ తెర‌వెన‌క అంతా తానై న‌డిపించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ భీమ్లానాయ‌క్ సినిమాలో సంయుక్త మీన‌న్‌ను తీసుకునేలా చేశారు. ఇక ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ – సాయితేజ్ కాంబోలో కొత్త సినిమా లాంఛ్ అయ్యింది. ఈ సినిమాను కూడా తెర‌వెన‌క అంతా త్రివిక్ర‌మే తానై న‌డిపిస్తున్నారు. భీమ్లానాయ‌క్ సినిమాకు స్క్రీన్ ప్లే మాట‌లు అందించిన‌ట్టుగానే.. ఈ సినిమా వ్య‌వ‌హారం అంతా త్రివిక్ర‌మే చూస్తున్నాట్ట‌.

ఈ సినిమాలో కూడా సాయితేజ్ స‌ర‌స‌న సంయుక్త మీన‌న్‌ను హీరోయ‌న్‌గా ఫిక్స్ చేసేశారు. ఇదంతా మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ సిఫార్సుతోనే జరిగినట్టు సమాచారం. ఈ సినిమా కోలీవుడ్ హిట్ మూవీ
వినోదాయ శితం సినిమాకు రీమేక్ గా వస్తోంది. ఇక రెండో సారి సంయుక్త‌కు ఛాన్స్ వ‌చ్చేలా చేసిన త్రివిక్ర‌మ్ ఇప్పుడు త‌న రిక‌మెండేష‌న్‌తోనే మ‌రో యంగ్ హీరో సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర ద‌క్కేలా చేశాడ‌ట‌.

అంటే చాలా త‌క్కువ టైంలోనే త్రివిక్ర‌మ్ సిఫార్సుల‌తో మూడు క్రేజీ ప్రాజెక్టుల్లో సంయుక్త ఛాన్స్ కొట్టేసింది. ఏదేమైనా త్రివిక్ర‌మ్ స్పెష‌ల్ ఇంట్ర‌స్ట్‌తో సంయుక్త మీన‌న్ కొద్ది రోజుల పాటు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయేలా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news