Moviesబిగ్ బ్లాస్టింగ్ అప్డేట్: KGF 3 లో విలన్ గా రానా.....

బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్: KGF 3 లో విలన్ గా రానా.. ఆ చిన్న క్లూ తో మ్యాటార్ లీక్..

కేజీఎఫ్( K.G.F).. ఈ ఒక్క పదం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారు మ్రోగిపోతుంది. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫిస్ ను షేక్ చేసి ఈ సినిమా.. అన్నిభాషల్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా భారీ వసూళ్లను కూడా రాబట్టింది, కేజీఎఫ్ సినిమాతో రాకింగ్ స్టార్ యశ్ అన్నిభాషల్లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ మధ్యనే రిలీజ్ అయిన కేజీఎఫ్ 2 గురించి ఎంత చెప్పినా తక్కువే.. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసింది.

దర్శకధీరుడు రాజమౌళి ఇన్నాళ్ళు సంపాదించుకున్న పేరుని..ప్రశాంత్ నీల్ ఒక్క సినిమాతోనే అందుకున్నాదు. కేజీఎఫ్ 2 సినిమా చూశాక జనాలు ఈ సిరీస్ కంటీన్యూ అయితే బాగుంటుందని..KGF 3 కూడా రావాలి అని కోరుకుంటున్నారు . ఇదే విషయాని ప్రశాంత్ ని అడిగితే సింపుల్ గా నవ్వేస్తున్నారు కానీ.. హోంబలే ప్రొడ్యూసర్స్ మాత్రం కన్ఫర్మ్ మెసేజ్ లు ఇన్ డైరెక్ట్ గా పాస్ చేస్తున్నారు. ఇప్పటికే హోంబలే టీమ్ ప్రీప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసిందని కూడా చెప్తున్నారు. సెకండ్ పార్ట్ లో యాష్ సముద్రం లో పడిపోతాడు గా.. అక్కడి నుండే KGF 3 కధను స్టార్ట్ చేస్తారట. కేజీఎఫ్ 1,2 పార్ట్ హిట్ అవ్వడంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రశాంత్ తో సినిమా చేయటానికి స్టార్ హీరోలంతా క్యూ కడుతున్నారు.

అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం KGF 3 లో విలన్ గా దగ్గుబాటి వారసుడు రానా నటించబోతున్నారట. ఈ మధ్యనే సినిమా కు సంబంధించిన పనుల్లో ప్రశాంత్ కి కంగ్రాట్స్ చెప్పుతూ రానా ట్వీట్ చేశాడు..దీనికి ప్రశాంత్..ధ్యాంక్యూ..తవరలోనే కలుద్దాం అని రిప్లై ఇచ్చాదు, దీంతో ..KGF 3 లో విలన్ గా రానా ని ఫిక్స్ చేశాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. కేజీయఫ్‌’ సినిమాల సిరీస్‌లో హీరో ఎంత ఫేమసో, విలన్లు కూడా అంతే ఫేమస్‌.

సినిమాలో హీరో యశ్ అనేది కొత్తగా చెప్పక్కర్లేదు. దీంతో విలన్‌ గా రానా అయితే సినిమా కి మరింత ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే రానా విలన్ గా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. బాహుబలి సినిమాలో ప్రభాస్ కు ..భీంలా నాయక్ సినిమాలో పవన్ కు ప్రత్యర్ధి పాత్రలో రానా ఇరగదీశాడు. తాజా గా వైరల్ అవుతున్న వార్త నిజమైతే సినిమా కి మరింత హైప్ ఇచ్చిన్నత్లే అవుతుందంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news