Movies' స‌ర్కారు వారి పాట ' ఫ‌స్ట్ డే వ‌సూళ్లు.... మ‌హేష్‌బాబు...

‘ స‌ర్కారు వారి పాట ‘ ఫ‌స్ట్ డే వ‌సూళ్లు…. మ‌హేష్‌బాబు ఊచ‌కోత ఇది…!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు న‌టించిన స‌ర్కారు వారి పాట గురువారం ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. రెండున్న‌రేళ్ల క్రితం సంక్రాంతికి వ‌చ్చిన స‌రిలేరు నీకెవ్వ‌రు లాంటి హిట్ సినిమా త‌ర్వాత స‌ర్కారు వారి పాట రిలీజ్ అయ్యింది. గీత‌గోవిందం లాంటి హిట్ సినిమా త‌ర్వాత ప‌ర‌శురాం డైరెక్ట్ చేయ‌డంతో పాటు కీర్తి సురేష్ మ‌హేష్ కాంబోలో తొలి సినిమా కావ‌డం… భారీ ఎత్తున ప్రి రిలీజ్ బ‌జ్ ఉండ‌డంతో అంచ‌నాలు మామూలుగా లేవు.

ప్ర‌పంచ వ్యాప్తంగా సర్కారు వారి పాట‌కు రు. 131 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. రెండు, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రు. 100 కోట్ల‌కు పైగా బిజినెస్ జ‌రిగింది. నాన్ థియేట్రిక‌ల్ రైట్స్‌తో క‌లుపుకుంటే రు. 170 కోట్ల బిజినెస్ జ‌రిగింది. ఇక నిన్న టాక్‌తో సంబంధం లేకుండా ఈ సినిమాకు ఏపీ, తెలంగాణ వ‌ర‌కే రు. 50 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు… రు. 36 కోట్ల షేర్ వ‌చ్చింది.

ఇక ఫ‌స్ట్ డే ఈ రేంజ్‌లో షేర్ అంటే.. ఇదే మూమెంట్ ఫ‌స్ట్ వీకెండ్‌లో కూడా కంటిన్యూ అయ్యే అవ‌కాశాలు ఉండ‌డం… పోటీ సినిమా లేక‌పోవ‌డంతో ఫ‌స్ట్‌వీకెండ్ కే స‌ర్కారు వారి పాట భారీ ఫిగ‌ర్స్ న‌మోదు చేయ‌డం ఖాయం. ఇక ఓవ‌ర్సీస్‌లో ఫ‌స్ట్ డేకే 1.1 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్ల‌తో స‌రికొత్త రికార్డు న‌మోదు చేసింది.

ఏరియాల వారీగా స‌ర్కారు వారి పాట ఫ‌స్ట్ డే వసూళ్లు :
నైజాం – 12. 24 కోట్లు
సీడెడ్ – 4.70
ఉత్త‌రాంధ్ర – 3.74
ఈస్ట్ – 3.25
వెస్ట్ – 2.74
గుంటూరు – 5.83
కృష్ణా – 1.85
నెల్లూరు – 1.56
———————————
ఫ‌స్ట్ డే గ్రాస్ – 50. 10 కోట్లు
ఫ‌స్ట్ డే షేర్ – 36.01 కోట్లు
———————————

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news