Moviesన‌మ్ర‌త గాసిప్స్‌ చెండాలం అంటూ ప‌రువు తీసేసిన మ‌హేష్‌...!

న‌మ్ర‌త గాసిప్స్‌ చెండాలం అంటూ ప‌రువు తీసేసిన మ‌హేష్‌…!

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన స‌ర్కారు వారి పాట సినిమా గురువారం రిలీజ్ అయ్యి ప్ర‌పంచ వ్యాప్తంగా టాక్‌తో సంబంధం లేకుండా వ‌సూళ్లు ద‌క్కించుకుంటోంది. సినిమాకు కొన్ని వ‌ర్గాల నుంచి మిక్స్‌డ్ టాక్ ఉన్నా కూడా అవేవి సినిమా చూసే వాళ్ల‌కు ప‌ట్ట‌డం లేదు. తాము ఎక్క‌డా బోర్ ఫీల్ కాలేద‌ని చెప్పేవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో కూడా స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

తాజాగా ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో మ‌హేష్‌బాబు త‌న భార్య న‌మ్ర‌త గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సుమ‌తో జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో మ‌హేష్ స్పందిస్తూ సెల‌బ్రిటీల గాసిప్‌పై మాట్లాడాడు. సెల‌బ్రిటీల‌పై వ‌చ్చే గాసిప్స్ గురించి మీరు ఎప్పుడైనా ? ఎక్క‌డైనా చ‌ర్చించుకుంటారా ? అన్న ప్ర‌శ్న‌కు మ‌హేష్ బదులిస్తూ లేదు అని ఆన్స‌ర్ ఇచ్చాడు. ఇలాంటి గాసిప్స్ గురించి న‌మ్ర‌త మాట్లాడుతారా ? అని ప్ర‌శ్నిస్తే మ‌హేష్ న‌మ్ర‌త ప‌రువు తీసేలా ఆన్స‌ర్ చేశాడు.

న‌మ్ర‌త‌తో క‌లిసి తాను ఎప్పుడూ గాసిప్స్ గురించి మాట్లాడ‌ను అని.. అయితే న‌మ్ర‌త మాత్రం త‌న స్నేహితుల‌తో క‌లిస్తే చ‌ర్చించుకునే గాసిప్స్ మాత్రం తాను విన‌లేక మూసుకుంటాను.. అవి అంత చెండాలంగా ఉంటాయ‌ని చెప్పాడు. అస‌లు అవి చెప్ప‌డానికి కూడా రావంటూ న‌మ్ర‌త ప‌రువు మొత్తం తీసేశాడు మ‌హేష్.

ఓవ‌రాల్‌గా గాసిప్స్ గురించి మ‌హేష్ చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే మ‌హేష్ స‌ర్కారు వారి పాట సినిమా త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసే సినిమాలో న‌టించ‌నున్నాడు. ఆ త‌ర్వాత రాజ‌మౌళి డైరెక్ట్ చేసే సినిమా చేస్తాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news