Moviesమ‌హేష్‌బాబు - నాని మ‌ల్టీస్టార‌ర్‌పై ఫ్యీజులు ఎగిరే ట్విస్ట్‌...!

మ‌హేష్‌బాబు – నాని మ‌ల్టీస్టార‌ర్‌పై ఫ్యీజులు ఎగిరే ట్విస్ట్‌…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట స‌క్సెస్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. రెండేళ్ల త‌ర్వాత త‌న అభిమానులు కోరుకున్న విజ‌యం ద‌క్క‌డంతో మ‌హేష్‌తో పాటు అభిమానులు అంద‌రూ ఫుల్ సెల‌బ్రేష‌న్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర్వాత మ‌హేష్ న‌టించిన సినిమా కావ‌డంతో మహేష్‌ను తెర‌మీద చూసేందుకే జ‌నాలు వెళుతున్నారు. దీంతో స‌ర్కారు వారి పాట వ‌సూళ్లు పోటెత్తుతున్నాయి.

ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. హారిక వాళ్లు భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు 12 సంవ‌త్స‌రాల క్రితం వ‌చ్చిన ఖ‌లేజా సినిమా త‌ర్వాత మ‌రోసారి మ‌హేష్ – త్రివిక్ర‌మ్ ఈ సినిమాతో జోడీ క‌డుతున్నారు. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో అత‌డు, ఖ‌లేజా రెండు సినిమాలు వ‌చ్చినా రెండు క‌మ‌ర్షియ‌ల్‌గా క్లిక్ కాలేదు. అయితే మంచి సినిమాలుగా మాత్రం ప్ర‌శంస‌లు సొంతం చేసుకున్నాయి.

ఇక తాజాగా మ‌హేష్ – త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌స్తోన్న SSMB28 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అల వైకుంఠ‌పురంలో సినిమా త‌ర్వాత మెగాఫోన్ ప‌ట్ట‌ని త్రివిక్ర‌మ్ త‌న టీంతో ఈ సినిమా కోసం ముమ్మ‌ర‌మైన క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్ వ‌చ్చేసింది. గ‌త కొద్ది రోజులుగా స‌రైన అప్‌డేట్ ప‌డ‌డం లేద‌ని భావిస్తోన్న మ‌హేష్ అభిమానులు తాజా అప్‌డేట్‌తో సంబ‌రాలు షురూ చేసుకోవ‌చ్చు.

ఈ సినిమాలో మ‌హేష్‌తో పాటు మ‌రో హీరో పాత్ర కూడా ఉంటోంద‌ట‌. ఆ పాత్ర కోసం త్రివిక్ర‌మ్ ఇప్ప‌టికే ఇద్ద‌రు ముగ్గురు హీరోల‌ను సంప్ర‌దించార‌ని టాక్ ? అయితే ఫైన‌ల్‌గా నేచుర‌ల్ స్టార్ నానిని ఫిక్స్ చేసిన‌ట్టు తెలిసింది. ఈ పాత్ర సెకండాఫ్‌లో ఎక్కువుగా క‌నిపిస్తుంద‌ట‌. గ‌తంలో నాని నాగార్జున‌తో క‌లిసి దేవ‌దాస్ సినిమాలో కూడా న‌టించాడు. ఈ ముఖ్య‌పాత్ర‌లో చేసేందుకు త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని నాని చెప్ప‌డంతో త్రివిక్ర‌మ్ ఆ పాత్ర‌కు మ‌రింత ప్రాధాన్యం ఉండేలా తీర్చిదిద్దాడ‌ట‌.

త్రివిక్ర‌మ్ సినిమా పూర్త‌య్యాక మ‌హేష్ – రాజ‌మౌళి సినిమా ఉంటుంది. ఇక రాజ‌మౌళితో సినిమా కోసం మ‌హేష్ అభిమానులు ఎంత ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తున్నారు. రెండు ద‌శాబ్దాల నుంచి వెయిట్ చేస్తోన్న వారికి ఎట్ట‌కేల‌కు ఇప్పుడు ఈ కాంబినేష‌న్ సెట్ అవుతుండ‌డంతో మామూలు ఉత్సాహం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news