Movies2 పాట‌లు పూర్తి చేసుకుని ఆగిపోయిన ఎన్టీఆర్ సినిమా తెలుసా...!

2 పాట‌లు పూర్తి చేసుకుని ఆగిపోయిన ఎన్టీఆర్ సినిమా తెలుసా…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ ఈ రోజు పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నాడు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా తార‌క్‌కు సోష‌ల్ మీడియాలో బ‌ర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ రోజు ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ గ‌త సినిమాల రికార్డులు… క‌లెక్ష‌న్లు… ఇత‌ర విశేషాల స‌మాచారాన్ని కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు. స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్ నుంచి నేటి త్రిబుల్ ఆర్ వ‌ర‌కు ఎన్టీఆర్ సినిమాలు ఏయే రికార్డులు క్రియేట్ చేశాయో అవి ఇప్పుడు బాగా వైర‌ల్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్‌లో స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్‌, ఆది, సింహాద్రి సినిమాలు మంచి హిట్స్‌గా ప‌డ్డాయి. అయితే ఆది త‌ర్వాత అదే యేడాది ఎన్టీఆర్ బి. గోపాల్ ద‌ర్శ‌కత్వంలో అల్ల‌రి రాముడు సినిమా చేశాడు. ఈ సినిమా కూడా సూప‌ర్ హిట్ అయ్యింది. అల్ల‌రి రాముడు త‌ర్వాత ఎన్టీఆర్ సింహాద్రి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. రాజ‌మౌళి – ఎన్టీఆర్ కాంబినేష‌న్లో వ‌చ్చిన రెండో సినిమా ఇది.

విఎంసీ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై వి. దొర‌స్వామి రాజు ఈ సినిమాను నిర్మించారు. ఏకంగా 150కు పైగా కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సింహాద్రి 55 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. ఎన్టీఆర్ కెరీర్‌లో ఓ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది అంటే మ‌ధ్య‌లో ఆగిపోయిన సంద‌ర్భాలు ఉండ‌వ‌నే చాలా మంది అనుకుంటారు. అయితే మ‌నోడి కెరీర్‌లో ఓ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి.. కొంత పార్ట్ షూటింగ్ జ‌ర‌గ‌డంతో పాటు రెండు పాట‌లు కూడా షూట్ జ‌రుపుకుంది.

ఈ సినిమాకు ప‌వ‌న్ శ్రీధ‌ర్ ద‌ర్శ‌కుడు. దొర‌స్వామి రాజు నిర్మాత‌. అయితే అవుట్ ఫుట్ విష‌యంలో ఎన్టీఆర్ శాటిస్‌పై కాలేదు. దీంతో ఈ సినిమాను మ‌ధ్య‌లోనే ఆపేశారు. అదే టైంలో రాజ‌మౌళి సింహాద్రి క‌థ‌తో సినిమా చేయాల‌ని ముందుగా బాల‌య్య‌తో అప్రోచ్ అయ్యారు. బాల‌య్య అదే టైంలో ప‌ల‌నాటి బ్ర‌హ్మ‌నాయుడు సినిమా చేస్తుండ‌డంతో మ‌రో ఫ్యాక్ష‌న్ సినిమా సింహాద్రిని వ‌దులుకున్నారు.

ఆ వెంట‌నే ఎన్టీఆర్ హీరోగా.. దొర‌స్వామి రాజు నిర్మాత‌గా రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో సింహాద్రి షూటింగ్ స్టార్ట్ అయ్యింది. నిజానికి రిలీజ్‌కు ముందు ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుంద‌న్న అంచ‌నాలు లేవు. క‌ట్ చేస్తే సింహాద్రి అప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఉన్న రికార్డుల‌ను ఊచ‌కోత కోసేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news