Moviesఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ ఫ‌స్ట్ లుక్‌తో పాటు మూడు బ్లాస్ట‌ర్...

ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ ఫ‌స్ట్ లుక్‌తో పాటు మూడు బ్లాస్ట‌ర్ అప్‌డేట్స్ ఇవే..!!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానుల‌తో పాటు సినిమా ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ప్ర‌మ‌ఖులు ఎన్టీఆర్‌కు సోష‌ల్ మీడియాలో బ‌ర్త్ డే విషెస్ చెపుతున్నారు. ఈ రోజు సోష‌ల్ మీడియాలో ఎన్టీఆర్ బ‌ర్త్ డే విషెస్ ట్రెండింగ్ న్యూస్‌గా మారింది. ఈ రోజు ఎన్టీఆర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఎన్టీఆర్ – కొర‌టాల సినిమా అప్‌డేట్ నిన్నే వ‌దిలేశారు. నిన్న ప్రోమోలో ప‌వ‌ర్ ఫుల్ డైలాగుతోనే కొర‌టాల శివ సినిమా ఎంత యాక్ష‌న్ ప్యాక్‌తో ఉండ‌బోతోందో క్లారిటీ ఇచ్చేశారు.

నిన్న ఈ ప్రోమో రిలీజ్ అవ్వ‌డంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబ‌రాలు షురూ చేసుకుంటున్నారు. ఇక ఈ రోజు బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ సినిమాపై క్లారిటీ వ‌చ్చేసింది. ఈ రోజు మ‌ధ్యాహ్నం ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్ ఇస్తామ‌ని ముందే ప్ర‌క‌టించారు. ఆ అప్‌డేట్ ఏదై ఉంటుందా ? అని ఫ్యాన్స్ ఉత్కంఠ‌తో ఎదురు చూస్తుండ‌గానే బంప‌ర్ అప్‌డేట్లు ఇచ్చారు.

ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్‌లో ఎన్టీఆర్ అస‌లు సిస‌లు మాస్ రూపంతో ర్యాంపేజ్ ఆడేశాడు. పాన్ ఇండియా సినిమా కావ‌డంతో ఆ రేంజ్‌లోనే సినిమా ఉండ‌బోతోంద‌ని ఫ‌స్ట్ లుక్‌తోనే తేల్చేశారు. ఎన్టీఆర్ 31 పేరుతో రాబోతోన్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌లో పెద్ద మీసాలు… ప‌వ‌ర్ ఫుల్ క‌ళ్ల‌తో జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌నిపిస్తున్నాడు.

ఇక ఈ సినిమా గురించి మూడు బ్లాస్టింగ్ అప్‌డేట్స్ కూడా ఇచ్చేశారు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఏప్రిల్‌, 2023 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. మైత్రీ మూవీస్ వారు ఈ భారీ యాక్ష‌న్ డ్రామా నిర్మిస్తార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌రూ అనుకున్నారు. అయితే ఇప్పుడు మ‌రో నిర్మాణ సంస్థ కూడా ఈ సినిమా నిర్మాణంలో యాడ్ అయ్యింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై క‌ళ్యాణ్‌రామ్ కూడా భాగ‌స్వామిగా ఉన్నారు.

హీరోయిన్‌గా బాలీవుడ్ నుంచి తీసుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్ట‌క‌పోయినా ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ ప్లాన్ చేస్తున్నాడ‌ట ద‌ర్శ‌కుడు నీల్‌. కేజీయ‌ఫ్ 2, స‌లార్ సినిమాకు ప‌నిచేసిన టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ప‌ని చేస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news