Moviesస‌మంత తండ్రితో నాగార్జున భేటీ... గంట సేపు ఏం జ‌రిగింది...!

స‌మంత తండ్రితో నాగార్జున భేటీ… గంట సేపు ఏం జ‌రిగింది…!

టాలీవుడ్ స్టార్ క‌ప్పుల్స్‌గా ఉన్న నాగ‌చైత‌న్య – స‌మంత విడిపోయి కూడా అప్పుడే 9 నెల‌లు అవుతోంది. వీరిద్ద‌రు విడిపోయి చాలా నెలలు అవుతున్నా వీరిద్ద‌రి గురించి ఏదో ఒక వార్త వైర‌ల్ అవుతూనే వ‌స్తోంది. ముఖ్యంగా స‌మంత సోష‌ల్ మీడియాలో చాలాసార్లు ఏదో ఒక సందేహం వ‌చ్చేలా ర‌క‌ర‌కాల పోస్టులు పెడుతూ వ‌స్తోంది. దీంతో స‌మంత ఇంకా అక్కినేని ఫ్యామిలీని, చైతును టార్గెట్ చేయ‌డం మానలేద‌నే చ‌ర్చ‌లు ఉన్నాయి.

ఇక 2017లో చైతు – స‌మంత పెళ్లి సంప్ర‌దాయ పద్ధ‌తిలోనూ, క్రిస్ట్రియ‌న్ ప‌ద్ధ‌తిలోనూ జ‌రిగింది. నాలుగేళ్ల కాపురం త‌ర్వాత వీరు అందరికి షాక్ ఇస్తూ విడిపోయారు. వీరి వ్య‌వ‌హారం ఎప్పుడో అంద‌రూ మ‌ర్చిపోయారు అనుకుంటోన్న టైంలో తాజాగా మ‌రోవార్త ఇప్పుడు వీరి గురించి వైర‌ల్ అవుతోంది. తాజాగా నాగార్జున స‌మంత తండ్రితో భేటీ అయ్యాడ‌న్న వార్త నిన్న‌టి నుంచి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ను ఊపేస్తోంది.

కార‌ణం ఏదైనా అస‌లు స‌మంత‌… చైతును పెళ్లి చేసుకోవ‌డం ముందే స‌మంత త‌ల్లిదండ్రుల‌కు ఇష్టం లేద‌ట‌. స‌మంతే బ‌ల‌వంతంగా వారిని ఒప్పించి పెళ్లి చేసుకుంద‌ని అంటుంటారు. వీరిని కలిపి ఉంచేందుకు నాగార్జున చేసిన ప్ర‌య‌త్నాలు కూడా ఫెయిల్ అయ్యాయి. వాళ్ల లైఫ్ వాళ్ల ఇష్టం.. ఇలా జ‌రిగి ఉండ‌కూడ‌దు.. మ‌నం ఏం చేద్దాం.. స‌మంత విడిపోయినా మా ఇంటి ఆడ బిడ్డే అని మాత్రం నాగ్ చెప్పాడు.

విడాకుల త‌ర్వాత స‌మంత‌, చైతు ఇద్ద‌రూ కూడా ఎవ‌రి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. స‌మంత గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శాకుంత‌లం సినిమాతో పాటు య‌శోద అనే థ్రిల్ల‌ర్ సినిమా కూడా చేస్తోంది. బాలీవుడ్ వెబ్‌సీరిస్‌ల‌తో పాటు హాలీవుడ్ సినిమాల‌కు సైతం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేసింది. ఇక తాజాగా స‌మంత తండ్రితో భేటీ అయిన నాగ్ గంట‌సేపు మాట్లాడిన‌ట్టు తెలుస్తోంది.

ఈ భేటీ స‌మంత – చైతు భ‌విష్య‌త్తు గురించే అంటున్నారు. విడాకులు అయిపోయి ఎవ‌రి లైఫ్ వాళ్లు లీడ్ చేస్తున్నా కూడా.. భ‌విష్య‌త్తులో భ‌ర‌ణం, ఇత‌ర విష‌యాల‌పై ఎవ్వ‌రికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకే ఈ భేటీ జ‌రిగిన‌ట్టు టాక్ ? అయితే అక్కినేని ఫ్యామిలీ స‌మంత‌కు భ‌ర‌ణం ఇస్తుందా ? స‌మంత దానిని స్వీక‌రిస్తుందా ? అన్న‌దానిపై క్లారిటీ లేన‌ప్ప‌ట‌కి నాగ్ – సామ్ తండ్రి భేటీ ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news