Moviesపవన్ చేసిన బిగ్ మిస్టేక్ ఇదే..ఇప్పటికైన సరిదిద్దుకుంటాడా..?

పవన్ చేసిన బిగ్ మిస్టేక్ ఇదే..ఇప్పటికైన సరిదిద్దుకుంటాడా..?

పవన్ కళ్యాణ్.. టాలీవుడ్లో పవర్‌స్టార్ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ పేరులోనే ఓ పవర్ ఉంది. ఆ పేరు చెబుతుంటేనే ఆయన అభిమానులు పూనకాలు వచ్చిన్నట్లు ఊగిపోతుంటారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పవన్..టాలీవుడ్ కి ఎన్నో భారి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు. పవన్ కళ్యాణ్ ఎన్ని సంవత్సరాలు సినిమా చేయకపోయినా పవన్ అభిమానులు మాత్రం తమ అభిమాన హీరో కోసం ఎన్ని సంవత్సరాలు అయినా ఎదురు చూస్తూనే ఉంటారు. సినీ న‌టుడిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టార్ డ‌మ్ ఏంట‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. అంద‌రిక‌న్నా భిన్నంగా సాగిపోయే ఆయ‌న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే.. ఎవ్వ‌రికైనా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది.

ఇలా పవన్ కెరీర్ లో ఎప్పుడు టాప్ లో ఉండటానికే అభిమానులు ఇష్టపడుతారు. ఇక మెగా అభిమానులు ఎప్పటి నుండో ఆశ గా ఎదురు చూస్తున్న సినిమా..”చిరు-పవన్ ” ఇద్దరిని కలిసి ఓ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చేయాలని. ఆ రోజు ఇండస్ట్రీ లెక్కలను అన్నీ మారిపోతాయి. కానీ, ఇప్పట్లో ఆ కోరిక నెరవేరేలా లేదు. కాగా, ఇలాంటి ఛాన్స్ గతం లో ఓ సినిమా కి వచ్చింది. చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే ఆఫర్ వస్తే..పవన్ వదులుకున్నాడు. చిరు హీరో గా నటించిన శంకర్ దాదాMBBS సినిమాలో ATM పాత్రకి పవన్ నే సెలక్ట్ చేశారట.


కానీ, ఆటైంలో పవన్ ఫుల్ సినిమాలతో బిజీ గా ఉన్నారట. దీంతో ఈ సినిమాని వదుకుకున్నట్లు ఆ పాత్రలో నటించిన శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చాడు. ఇది నిజంగా పవన్ చేసిన బిగ్ మిస్టేక్ నే..ఇక పై ఆ ఛాన్స్ వస్తాదో రాదో కూడా తెలియదు..ఎందుకంటే రాబోయే రోజుల్లో పవన్ రాజకీయాలో సక్సెస్ అయితే పూర్తిగా సినిమాలకు దూరం అవుతారు అంటున్నారు జనసైనికులు..మరి చూడాలి మెగా అభిమానుల ఆశ ఎప్పుడు నెర వేరుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news