Moviesరేణుదేశాయ్ రెండో భ‌ర్త ఎవ‌రు... ఏం చేస్తుంటాడో తెలుసా...!

రేణుదేశాయ్ రెండో భ‌ర్త ఎవ‌రు… ఏం చేస్తుంటాడో తెలుసా…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ పవన్‌కు విడాకులు ఇచ్చి పది సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. వాస్తవంగా చూస్తే పవన్ కు ముందుగా వైజాగ్ కు చెందిన నందిని అనే అమ్మాయితో చిరంజీవి పెళ్లి జరిపించారు. అప్పటికీ పవన్ సినిమాల్లోకి రాలేదు. కారణాలు ఏవైనా ఏడాదిలోగానే పవన్ – నందిని మధ్య మనస్పర్థలు రావడంతో వారు విడిపోయారు. ఆ తర్వాత పవన్ కు తిరుగులేని స్టార్ డమ్ సొంతమైంది. ఖుషి సినిమా వరకు వరుసగా ఆరు హిట్ సినిమాలు పవన్ ఖాతాలో పడ్డాయి.

పవన్ అంటే అప్పట్లో తెలుగునాట యూత్ అంతా మనోడు మైకంలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే బద్రి సినిమాలో తనతో కలిసి నటించిన రేణు దేశాయ్‌తో సహజీవనం మొదలుపెట్టాడు. తన దర్శకత్వంలో వచ్చిన జానీ సినిమాలోనూ రేణు దేశాయ్‌నే హీరోయిన్‌గా తీసుకున్నాడు. పవన్ రేణు దంపతులకు అకీరానంద‌న్‌, ఆద్య‌ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ సమయంలో లో పవన్ రేణు దేశాయ్ ను అధికారికంగా తన భార్యగా స్వీకరించారు. విచిత్రం ఏమిటంటే రేణును పవన్ తన భార్యగా స్వీకరించిన‌ రెండేళ్లకే వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి.

ఆ తర్వాత తీన్మార్ సినిమాలో తనతో కలిసి నటించిన రష్యన్ అమ్మాయి అన్నా లెజ‌న్నోవాను ప‌వ‌న్ మూడో పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పవన్‌తో విడాకుల అనంతరం రేణు తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణేలో తన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. చాలా ఏళ్ల పాటు తల్లిదండ్రుల వద్దే ఉన్న రేణు గత ఏడాది రెండో పెళ్ళికి రెడీ అవుతున్నట్టు వార్తలు వచ్చాయి. అతడితో ఎంగేజ్మెంట్ జరిగిన ఫోటోను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

తనకు కాబోయే రెండో భర్త ఫేస్ ను దాచేసిన రేణు అతడి చేతికి ఉన్న రింగ్ ను చూపించేలా ఫోటో పెట్టింది. అయితే ఇప్పటికీ రేణు రెండో పెళ్లిపై క్లారిటీ లేదు. గ‌తేడాది సరదాగా ఆలీతో షో కి వచ్చిన రేణుదేశాయ్ తన రెండో భర్త గురించి కొన్ని విషయాలు మాత్రం చెప్పింది. అతడు ఓ ఐటీ కంపెనీ మేనేజర్‌గా పనిచేస్తూ ఉంటాడ‌ని… ముందు అత‌డు అమెరికాలో ఉద్యోగం చేసే అతడు వాళ్ళ తండ్రికి ఆరోగ్యం స‌రిగా లేకపోవడంతో ఇండియాకు వచ్చి పూణేలో ఐటి ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పింది.

రెండో పెళ్లి పై చాలా రోజుల పాటు తాను ఆలోచన చేశానని… అయితే తన కోసం… తన పిల్లల కోసం రెండో పెళ్లి చేసుకోక త‌ప్ప‌డం లేదని ఓ సందర్భంలో ప్రస్తావించింది. రేణు దేశాయ్ పాల్గొన్న అదే షోలో రేణుక కాబోయే రెండో భర్త ఓ వాయిస్ ఓవర్ కూడా పంపించాడు. అత‌డు రేణును ఆకాశానికి ఎత్తేయడంతో పాటు తన జీవితం ఎంతో సంతోషంగా ఉండటానికి కారణం అంటూ ఆమెను మెచ్చుకున్నాడు.

అయితే వీరి ఎంగేజ్మెంట్ జరిగి కూడా ఏడాది అయింది. అయితే ఇప్పటివరకు రేణు రెండో భర్త ఎవరు ?అన్నదానిపై క్లారిటీ లేదు. మరోవైపు తాను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటన చేసిన వెంటనే విమర్శించిన పవన్ అభిమానులు… ఇటీవల తమ పిల్లల కోసం రేణు – పవన్ కలిసినప్పుడు మాత్రం ఆమెను ప్రశంసిస్తూ కామెంట్లు పెట్టారు. రేణు రెండో పెళ్లి ఎప్పుడు జరుగుతుందో ? తెలియదు కానీ పవన్ – రేణు విడిపోయినా తమ పిల్లల కోసం కలుస్తూనే ఉంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news