Moviesషాకింగ్‌: ఆ టాలీవుడ్ యంగ్ హీరోతో కీర్తిసురేష్ పెళ్లి...!

షాకింగ్‌: ఆ టాలీవుడ్ యంగ్ హీరోతో కీర్తిసురేష్ పెళ్లి…!

ఏ ముహూర్తాన మ‌హాన‌టి సినిమాలో న‌టించిందో కాని అప్ప‌టి నుంచి కీర్తిసురేష్ ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతోంది. అల‌నాటి మేటిన‌టి సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ న‌టించింది అనే కంటే జీవించేసింది. అస‌లు ఈ త‌రం సినీ అభిమానులు, సావిత్రి వీరాభిమానులు ఈ సినిమాలో చేసింది కీర్తీ సురేష్ కాదు.. సావిత్రి మ‌ళ్లీ దివి నుంచి భువికి దిగివ‌చ్చిందే అన్నంత గొప్ప‌గా చేసింద‌ని ప్ర‌తి ఒక్క‌రు మెచ్చుకున్నారు. మ‌హాన‌టి సినిమాలో సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ న‌ట‌న గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే అవుతుంది.

అయితే కీర్తి సురేష్ ఎంచుకునే క‌థ‌లు, ఓటీటీ సినిమాలు చేయ‌డంతో ఆమెకు అనుకున్నంత క్రేజ్ రాలేదు. అందంలోనే కాదు.. అభిన‌యంలోనూ ఆమె ముందు ర‌ష్మిక మంద‌న్న‌, పూజా హెగ్డే ఎందుకు స‌రితూగ‌రు. దీనికి తోడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ – త్రివిక్ర‌మ్ అజ్ఞాత‌వాసి సినిమాలో ఆమెకు ఛాన్స్ వ‌చ్చినా ఆ సినిమా ప్లాప్ అవ్వ‌డం కూడా కీర్తి బ్యాడ్‌ల‌క్ అని చెప్పాలి. ప్ర‌స్తుతం కీర్తి సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ప‌క్క‌న స‌ర్కారువారి పాట సినిమా చేస్తోంది.

ఈ సినిమా హిట్ అయ్యి అయినా కీర్తి ద‌శ మారుతుందేమో ? చూడాలి. ఇక ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోతో కీర్తి సురేష్ పెళ్లి కాబోతోందంటూ ఇండస్ట్రీ వ‌ర్గాల్లో వార్త‌లు ఒక్క‌టే గుప్పుమంటున్నాయి. అదేంటి కీర్తి సురేష్‌కు పెళ్లియ‌పోతోందా ? అది కూడా టాలీవుడ్ యంగ్ హీరోతోనా ? ఇదేం ట్విస్టు అనుకుంటున్నారా ? ఇది నిజ‌మే..! అయితే అది రియ‌ల్ లైఫ్‌లో కాదు.. రీల్ లైఫ్‌లో..!

వ‌రుస ప్లాపుల‌తో విల‌విల్లాడుతోన్న శ‌ర్వానంద్ ప్ర‌స్తుతం ఎలాగైనా హిట్ కొట్టాల‌ని గ‌ట్టిగా ఫిక్స్ అయ్యాడు. రౌడీ ఫెలో, ఛల్ మోహన్ రంగ చిత్రాల ఫేమ్ కృష్ణ చైతన్యతో ఓ వైవిధ్య‌మైన సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను ఫీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ కోసం ముందుగా కృతిశెట్టిని అనుకున్నారు. డేట్స్ స‌ర్దుబాటు కాక ఆమె త‌ప్పుకోవ‌డంతో ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి కీర్తిని ఎంపిక చేశార‌ట‌.

సినిమా క‌థ‌, కాన్సెప్ట్‌తో పాటు తన పాత్ర నచ్చడంతో, కీర్తి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ పాత్ర‌లో కీర్తికి శ‌ర్వాతో ప్రేమ పెళ్లి ఉంటుంద‌ని.. ఆమెకు ఓ కొడుకు కూడా ఉంటాడ‌ని.. నిన్ను కోరి సినిమాలాగా సెంటిమెంట్‌తో సినిమా న‌డుస్తుంద‌ని అంటున్నారు. మ‌రి ఈ పాత్ర కీర్తికి ఎంత మంచి పేరు తెచ్చిపెడుతుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news