MoviesRRR 8 డేస్ వ‌ర‌ల్డ్ వైడ్ వ‌సూళ్లు... స‌డెన్‌గా డ్రాఫ్ అయిపోయాయేంటి...

RRR 8 డేస్ వ‌ర‌ల్డ్ వైడ్ వ‌సూళ్లు… స‌డెన్‌గా డ్రాఫ్ అయిపోయాయేంటి బాసు…!

త్రిబుల్ ఆర్ వ‌సూళ్లు స‌డెన్‌గా డ్రాఫ్ అవుతున్న ప‌రిస్థితి. ఏడో రోజు వ‌సూళ్లు బాగా త‌గ్గాయి. అయితే ఎనిమిదో రోజు మాత్రం కాస్త పుంజుకున్నాయి. ట్రేడ్ రిపోర్ట్స్ ప్ర‌కారం వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఎనిమిది రోజు మాత్ర‌మే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 8.33 కోట్ల షేర్ రాబట్టింది. ఇంతకుముందు ఐకాన్ స్టార్ అల వైకుంఠ‌పుర‌ములో సినిమా రు 7.92 కోట్ల షేర్‌తో ఫ‌స్ట్ ప్లేసులో ఉంది. అంటే రు. 41 ల‌క్ష‌ల మార్జిన్‌తో ఏపీ, తెలంగాణ వ‌ర‌కు 8వ రోజు అల రికార్డును త్రిబుల్ ఆర్ బీట్ చేసేసింది.

ఇక మొత్తం 8 రోజుల‌కు ఏపీ, తెలంగాణ‌లో రు. 195.98 కోట్ల షేర్‌తో పాటు రు. 292. 50 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక ఇత‌ర భాష‌లు, రెస్టాఫ్ ఇండియా, ఓవ‌ర్సీస్ వ‌సూళ్లు కూడా క‌లుపుకుంటే వరల్డ్‌వైడ్‌గా 8 రోజుల‌కు రూ. 414.88 కోట్ల షేర్, రూ. 751 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక త్రిబుల్ ఆర్ బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే మ‌రో రు. 36.12 కోట్ల షేర్ క‌లెక్ట్ చేయాలి. అప్పుడు ఈ సినిమా క్లీన్ బాక్సాఫీస్ హిట్ అయిన‌ట్టే..!

ఇప్ప‌టికే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దాటేసింది. అయితే వ‌సూళ్లు మాత్రం బాహుబ‌లి 2 తో పోలిస్తే స్పీడ్‌గా డ్రాప్ అయ్యాయి. లాంగ్ ర‌న్‌లో బాహుబ‌లి 2 రేంజ్ వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం అయితే క‌ష్టంగానే క‌నిపిస్తోంది. ఏప్రిల్ 14న కేజీయ‌ఫ్ 2 ఉంది. అప్ప‌టి వ‌ర‌కు త్రిబుల్ ఆర్‌కు ఎదురు లేదు. అయితే 10 రోజుల త‌ర్వాత టిక్కెట్ రేట్లు త‌గ్గాక ఎంత వ‌ర‌కు వ‌సూళ్లు రాబ‌డుతుంద‌న్న‌ది మాత్రం కాస్త సందేహంగానే ఉంది.

త్రిబుల్ ఆర్ రియాలవారీగా 8 రోజుల కలెక్షన్స్ (కోట్లలో)…
నైజాం: 81.53
సీడెడ్: 38.63
ఉత్తరాంధ్ర: 21.75
ఈస్ట్ : 11.67
వెస్ట్ : 10.08
గుంటూరు: 14.43
కృష్ణా: 11.14
నెల్లూరు: 6.75
——————————————
ఏపీ+తెలంగాణ: రూ. 195.98 కోట్లు
——————————————
కర్ణాటక: 29.60
తమిళనాడు: 27.15
కేరళ: 8.50
హిందీ: 71.80
రెస్టాఫ్ ఇండియా: 5.45
ఓవర్సీస్: 76.40
——————————————–
టోటల్ వరల్డ్‌వైడ్: రూ. 414.88 కోట్లు
———————————————

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news