Moviesఆ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌కు ఎన్టీఆరే డైలాగులు రాసుకున్నారు.. మీకు తెలుసా...!

ఆ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌కు ఎన్టీఆరే డైలాగులు రాసుకున్నారు.. మీకు తెలుసా…!

అన్న‌గారు ఎన్టీఆర్‌ న‌టించిన సినిమాల్లో ఏది తీసుకున్నా.. డైలాగుల ప‌రంగా.. చాలా అర్ధం ఉంటుంది. ప్ర‌తి ప‌దం కూడా చాలా నీట్‌గా.. ఉచ్ఛార‌ణ‌కు త‌గిన విధంగా అర్ధం వ‌చ్చేలా.. ఉంటుంది. అంతేకాదు.. డైలాగుల‌ను మింగేయ‌డం.. వేరే భాషా ప‌దాల‌ను తీసుకువ‌చ్చి క‌ల‌పడం.. ఏదో ప్ర‌త్యేక‌త పేరుతో కొత్త కొత్త ప్ర‌యోగాలు చేయ‌డం.. వంటివి అన్న‌గారికి న‌చ్చేవి కాదు. అందుకే అన్న‌గారి సినిమాల‌కు డైలాగులు రాసేవారిని.. నిర్మాత‌లు చాలా జాగ్ర‌త్త‌గా ఎంచుకునేవారు.

అయితే.. అన్న‌గారు కూడా స్వ‌యంగా కొన్ని కొన్ని సినిమాలు తీశారు. ఆయా సినిమాల్లో అన్న‌గారు త‌న సీన్‌కు సంబంధించిన డైలాగుల‌ను రైట‌ర్‌ను ద‌గ్గ‌ర కూర్చోబెట్టుకుని మ‌రీ రాయించుకునేవార‌ట‌. ఒక‌వేళ ఏదైనా కుద‌ర‌క‌పోతే.. ఎలాంటి మొహ‌మాటం లేకుండా.. చెప్పేసి మ‌ళ్లీ మ‌ళ్లీ రాయించుకున్న సంద‌ర్భా లు కూడా ఉన్నాయి. అప్ప‌టి కూడా రైట‌ర్ రాయ‌లేక పోతే.. తనే స్వ‌యంగా రాసుకున్న సంద‌ర్భాలు కూడా ఉన్నాయ‌ని.. అన్న‌గారే స్వయంగా చెప్పుకొన్నారు. ఇలా.. జ‌స్టిస్ చౌద‌రి, మేజ‌ర్ చంద్ర‌కాంత్ సినిమాల్లో త‌న డైలాగులు త‌నే రాసుకున్నారు.

అంతేకాదు.. సినిమాల‌తో సంబంధం లేని వారిని కూడా తీసుకువ‌చ్చి.. డైలాగులు రాయించిన సంద‌ర్భా లు కూడా అన్న‌గారి సినిమాల్లో క‌నిపిస్తాయి. అన్న‌గారు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న సినిమా.. దాన‌వీరశూర‌క‌ర్ణ‌. దీనికి ముగ్గ‌రు రైట‌ర్లు డైలాగులు రాశారు. వాస్త‌వానికి ఒక సినిమాకు ఒక్క‌రే డైలాగులు రాస్తారు. కానీ, ఈ సినిమాలో దుర్యోధ‌న పాత్ర‌కు.. మాత్రం అన్న‌గారు ప‌నిగ‌ట్టుకుని.. తిరుప‌తి వెంక‌ట క‌వుల‌ను ఒప్పించి… మ‌రీ.. దుర్యోధ‌న పాత్ర‌కు డైలాగులు రాయించుకున్నారు.

వాస్త‌వానికి వారికి సినిమాల‌తో సంబంధంలేదు. అయినా.. కూడా అన్న‌గారు.. వారికి ఉన్న పౌరాణిక విద్య‌ను..జ్ఞానాన్ని.. ఈ సినిమాకు వినియోగించుకున్నారు. అందుకే ఈ సినిమాలో డైలాగులు.. ఇప్ప‌టికీ.. రికార్డే.. “ఆచార్య దేవా.. ఏమంటివేమంటివి.. పాంచాలి పంచ‌భ‌ర్తృక‌.. “ ఇలా.. ప‌లు డైలాగులు సామాన్యుల నాలుక‌పై ఇప్ప‌టికీ వినిపిస్తుంటాయి. ఇదీ.. అన్న‌గారి స్ట‌యిల్‌.!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news