Moviesఎన్టీఆర్‌తో సినిమా లైన్ చెప్పేసిన కొరటాల... రెండు ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్స్...

ఎన్టీఆర్‌తో సినిమా లైన్ చెప్పేసిన కొరటాల… రెండు ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్స్ ఇవే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసపెట్టి సినిమాలు మీద సినిమాలు చేసుకుంటూ దూసుకు పోతున్నాడు. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ కు పాన్ ఇండియా క్రేజ్ కూడా వచ్చింది. ఈ తరం జనరేషన్ యంగ్ హీరోలలో ఏ హీరోల‌కు లేనట్టుగా డబుల్ హ్యాట్రిక్ హిట్లు ఎన్టీఆర్ ఖాతాలో పడ్డాయి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక స్టార్ హీరో వరుసగా ఆరు సినిమాల‌తో హిట్‌ కొట్టడం అంటే మామూలు విషయం కాదు.. అలాంటి అరుదైన రికార్డు సీనియర్ హీరోలు ఎన్టీఆర్, చిరంజీవి, వెంకటేష్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రమే దక్కింది. ప్రస్తుతం త్రిబుల్ ఆర్ స‌క్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో గతంలో జనతా గ్యారేజ్ సినిమా వచ్చింది. జనతా గ్యారేజ్ సినిమా 2016 లోనే ఏకంగా రు. 144 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి సంచలన విజయం సాధించింది.

ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ మెసేజ్ ఉంటుంది. ఇక ఇప్పుడు మరోసారి కొరటాలతో ఎన్టీఆర్ నటిస్తుండటంతో ఈ సినిమా కథ ఎలా ? ఉంటుంది. కొరటాల తనకు అలవాటు అయినట్టుగానే మెసేజ్ ఓరియంటెడ్ కథాంశాన్ని తెరకెక్కిస్తారు అన్న చర్చలు అయితే నడుస్తున్నాయి.
ఇక ఎన్టీఆర్ తో చేసే సినిమా గురించి ఆచార్య ప్రమోషన్లలో కొరటాల కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమా మిర్చి సినిమాను మించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందన్నారు.

తాను మిర్చి సినిమా తర్వాత ఆ రేంజ్లో హై వోల్టేజ్ యాక్షన్ సినిమా చేయలేదని… ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా మిర్చి సినిమాను మించిన హై వోల్టేజ్ యాక్షన్ తో ఉంటుందని చెప్పారు. అంటే కొరటాల – ఎన్టీఆర్ సినిమా పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న అన్న విషయంపై క్లారిటీ అయితే వచ్చేసింది. ప్రస్తుతం త్రిబుల్ ఆర్‌ సినిమా తర్వాత ఎన్టీఆర్ కు ఎంత లేదన్నా పాన్ ఇండియా మార్కెట్ పెరిగింది.

ఇప్పుడు దానిని కూడా క్యాష్‌ చేసుకుని కొరటాల కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. జూన్ నుంచి కొరటాల – ఎన్టీఆర్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. యువసుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ – నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news