Moviesప్ర‌కాష్‌రాజ్ చేసిన‌ మోసం త‌ట్టుకోలేక‌పోయిన ప‌వ‌న్‌.. ఆ సినిమాయే గొడ‌వ‌ల‌కు కార‌ణ‌మైందా...

ప్ర‌కాష్‌రాజ్ చేసిన‌ మోసం త‌ట్టుకోలేక‌పోయిన ప‌వ‌న్‌.. ఆ సినిమాయే గొడ‌వ‌ల‌కు కార‌ణ‌మైందా ?

టాలీవుడ్‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న కెరీర్‌లో ఎంతో మంది న‌టుల‌తో క‌లిసి ప‌నిచేశాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ప‌నిచేయ‌డం అంటే ఎంత పెద్ద స్టార్‌కు అయినా.. పెద్ద హీరోయిన్‌కు అయినా.. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుకు అయినా అదో గొప్ప‌. ప‌వ‌న్‌తో క‌నీసం ఒక్క సినిమా అయినా చేయాల‌ని అనుకునే వాళ్లు ఇండ‌స్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ – ప్ర‌కాష్‌రాజ్ కాంబినేష‌న్ అంటేనే ఎంత సూప‌ర్బ్‌గా ఉంటుందో తెలిసిందే. వీరి కాంబోలో సుస్వాగ‌తంతో పాటు బద్రి సినిమాలు వ‌చ్చాయి. బ‌ద్రి సినిమాలో నువ్వు నంద అయితే నేను బ‌ద్రి బ‌ద్రీనాథ్ అనే ప‌వ‌న్ ప్ర‌కాష్‌రాజ్‌తో పోటాపోటీగా చెప్పే డైలాగులు సంచ‌ల‌నం అయ్యాయి.

ఆ తర్వాత జ‌ల్సా సినిమాలో కూడా వీరు న‌టించారు. అయితే మ‌ధ్య‌లో వ‌చ్చిన గుడుంబా శంక‌ర్ సినిమా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు, ప్ర‌కాష్‌రాజ్‌కు మ‌ధ్య గొడ‌వ‌ల‌కు కార‌ణ‌మైంది. ఆ సినిమాలో ప్ర‌కాష్‌రాజ్ చేసిన మోసం ప‌వ‌న్‌కు పిచ్చ కోపం తెప్పించింది. చివ‌ర‌కు ప‌వ‌న్ త‌న సినిమాల్లో ప్ర‌కాష్‌రాజ్‌ను వ‌ద్ద‌ని చెప్పేవ‌ర‌కు వెళ్లింది. అయితే త‌ర్వాత ఫిల్మ్‌ఛాంబ‌ర్ పెద్ద‌లు, ద‌ర్శ‌కుల సంఘం పెద్ద‌లు రాజీ కుద‌ర్చ‌డంతోనే ప‌వ‌న్ – ప్ర‌కాష్‌రాజ్ క‌లిసి మ‌ళ్లీ ప‌నిచేశారు. గుడుంబా శంక‌ర్ సినిమాలో ఆశిష్ విద్యార్థి చేసిన కామెడీ విల‌న్ క్యారెక్ట‌ర్‌కు ముందుగా ప్ర‌కాష్‌రాజ్‌ను తీసుకున్నారు.

ఈ సినిమాకు బ‌స‌వా వీర‌శంక‌ర్ ద‌ర్శ‌కుడు. మీరా జాస్మిన్ హీరోయిన్. అజంనా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నాగేంద్ర‌బాబు స్వ‌యంగా నిర్మించాడు. అయితే ప్ర‌కాష్‌రాజ్‌పై కొన్ని సీన్లు షూట్ చేశాక‌.. ఆయ‌న త‌న అమ్మ గారి ఆరోగ్యం బాగోలేద‌ని చెప్పి షూటింగ్‌కు డుమ్మా కొట్టి వెళ్లిపోయాడు. అయితే ఆయ‌న ఇక్క‌డ షూటింగ్ వ‌దిలేసి వెళ్లి త‌మిళ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ విష‌యం తెలిసిన ప‌వ‌న్ ప్ర‌కాష్‌రాజ్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో పాటు వెంట‌నే సినిమా నుంచి తీసేసి… ఆశిష్ విద్యార్థిని పెట్టుకుని ఆ సీన్లు మ‌ళ్లీ షూట్ చేయించార‌ట‌.

అయితే దీనిపై ఛాంబ‌ర్‌లో ఫిర్యాదు చేయ‌డంతో ప్ర‌కాష్‌రాజ్ జ‌రిమానా క‌ట్ట‌డంతో పాటు త‌న త‌ప్పు కూడా ఒప్పుకున్నాడ‌ట‌. ప్ర‌కాష్‌రాజ్ క్ష‌మాప‌ణ చెప్పాకే ఆ త‌ర్వాత మ‌ళ్లీ తెలుగు సినిమాల్లో న‌టించాడ‌ని ఈ సినిమా ద‌ర్శ‌కుడు వీర‌శంక‌ర్ స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. అయితే ప్ర‌కాష్‌రాజ్ ఆ త‌ర్వాత కూడా చాలా సార్లు.. చాలా మందికి ఇబ్బందులు క‌లిగించిన సంగ‌తి తెలిసిందే. శ్రీను వైట్ల త‌న‌ను ఓ సినిమా నుంచి తొల‌గించాడ‌ని నేరుగానే ప్ర‌కాష్‌రాజ్ గోవిందుడు అంద‌రివాడే సినిమా ప్రెస్‌మీట్లో విమ‌ర్శ‌లు చేశారు.

ఇక సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు సైతం ప్ర‌కాష్‌రాజ్ తీరుపై విసిగిపోయే త‌న సినిమాల్లో ఆయ‌న వ‌ద్ద‌ని చెప్పాడ‌న్న గుస‌గుస‌లు కూడా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపించాయి. ప్ర‌కాష్‌రాజ్ వాస్త‌వానికి మంచి న‌టుడే.. జాతీయ అవార్డు గ్ర‌హీత‌. అయితే ఆయ‌న వ్య‌క్తిత్వం, దురుసుత‌నంతో ఇండ‌స్ట్రీలో చాలా మందితో అన‌వ‌స‌రంగా సున్నం పెట్టుకున్నాడు. ఇక గ‌తేడాది ప్ర‌కాష్‌రాజ్ మా ఎన్నిక‌ల్లో పోటీ చేసి మంచు విష్ణుపై ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news