Moviesఆ సినిమాకు సీక్వెల్ చేస్తానంటోన్న తార‌క్‌.. మ‌రో సూప‌ర్ హిట్ ప‌క్కా...!

ఆ సినిమాకు సీక్వెల్ చేస్తానంటోన్న తార‌క్‌.. మ‌రో సూప‌ర్ హిట్ ప‌క్కా…!

ఎన్టీఆర్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాకు ముందు వ‌ర‌కు ఎన్టీఆర్‌తో పాటు ఆయ‌న అభిమానుల్లో ఒక్క‌టే టెన్ష‌న్‌.. అస‌లే మూడేళ్ల పాటు ఈ సినిమాకు టైం వేస్ట్ చేశాడు. ఈ సినిమా ఏ స్థాయి హిట్ అవుతుంద‌న్న ఆందోళ‌న అయితే ఉంది. ఇప్పుడు ఆ ఆందోళ‌న లేదు. ఈ త‌రం జ‌న‌రేష‌న్ హీరోల్లోనే ఎవ్వ‌రూ సాధించన అరుదైన డ‌బుల్ హ్యాట్రిక్ హిట్లు స‌క్సెస్ ఎన్టీఆర్ చూశాడు. ఎన్టీఆర్ కెరీర్లో టెంప‌ర్‌కు ముందు వ‌ర‌కు ఎన్ని ఒడుదుడుకులు.. అన్ని ప్లాపులే.. టెంప‌ర్ త‌ర్వాత ఎన్టీఆర్ వెన‌క్కు తిరిగి చూసుకోవాల్సిన పనిలేకుండా పోయింది.

ఇక త్రిబుల్ ఆర్ త‌ర్వాత కొర‌టాల శివ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఎన్టీఆర్ సోద‌రుడు క‌ళ్యాణ్‌రామ్ నిర్మాత‌. అలాగే కొర‌టాల స్నేహితుడు మిక్కిలినేని సుధాక‌ర్ కూడా మ‌రో నిర్మాత‌. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ లైన‌ప్‌లో బుచ్చిబాబు సానా, ప్ర‌శాంత్ నీల్ ఉన్నారు. ఇక ఎన్టీఆర్ సినిమా రిలీజ్‌కు 10 రోజుల ముందు నుంచే ఫుల్‌గా ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొంటున్నాడు. ప్ర‌మోష‌న్ల‌లో రాజ‌మౌళి – ఎన్టీఆర్ – చ‌ర‌ణ్ ముగ్గురూ పాల్గొన్నా కూడా ఎన్టీఆర్ ప్ర‌మోష‌న్లే హైలెట్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ త‌న ఎన‌ర్జిటిక్‌తో ప్ర‌మోష‌న్ల‌ను పూర్తిగా వ‌న్‌సైడ్ చేసేశాడు. ఈ ప్ర‌మోష‌న్ల‌లో తాను న‌టించిన సినిమాల్లో ఏదైనా సినిమాకు సీక్వెల్ చేయాల‌ని ఉందా ? అన్న ప్ర‌శ్న‌కు అదుర్స్ పేరు చెప్పాడు. అదుర్స్ సినిమాకు సీక్వెల్ చేయాల‌న్న త‌న మ‌న‌సులో కోరిక బ‌యట పెట్టాడు. 2010 సంక్రాంతి కానుక‌గా వ‌చ్చిన ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ‌బుల్ రోల్ చేయ‌గా.. న‌య‌న‌తార‌, షీలా హీరోయిన్లుగా న‌టించారు.

వినాయ‌క్ కామెడీ టేకింగ్‌, చారిగా, యాక్ష‌న్ హీరోగా ఎన్టీఆర్ డ‌బుల్ రోల్ సినిమాను సూప‌ర్ హిట్ చేశాయి. ముఖ్యంగా చారి పాత్ర‌లో ఎన్టీఆర్ పోషించిన కామెడీ హైలెట్‌. ఆ త‌ర్వాత చాలా సార్లు ఈ సినిమా డైరెక్ట‌ర్ వినాయ‌క్ సైతం అదుర్స్ సినిమాకు తాను సీక్వెల్ చేసేందుకు రెడీగా ఉన్నాన‌ని చెపుతూ వ‌స్తున్నారు. అయితే ఎన్టీఆర్‌కు – వినాయ‌క్‌తో చేసే టైం క‌లిసి రావ‌డం లేదు. ఇక ఇప్పుడు ఎన్టీఆరే నేరుగా అదుర్స్ సీక్వెల్‌పై త‌న మ‌న‌సులో మాట చెప్ప‌డంతో అదుర్స్ సీక్వెల్ త్వ‌ర‌లో వ‌చ్చే ఛాన్స్ ఉంటుందేమో ? చూడాలి. ఒక వేళ అదుర్స్ సీక్వెల్ వ‌స్తే ఖ‌చ్చితంగా సూప‌ర్ హిట్ ఖాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news