Movies#NTR31 గ్రాండ్ లాంఛింగ్ .. మూహుర్తం ఫిక్స్ చేసిన క్రేజీ డైరెక్టర్..ఆ...

#NTR31 గ్రాండ్ లాంఛింగ్ .. మూహుర్తం ఫిక్స్ చేసిన క్రేజీ డైరెక్టర్..ఆ స్పెషల్ రోజే..!!

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘రౌద్రం..రణం..రుధిరం’(ఆర్‌ఆర్‌ఆర్‌)’మూవీ కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది సినీప్రియులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలోని ప్రతి ఒక్క క్యారెక్టర్ ను డైరెక్టర్ రాజమౌళి ఎంతో ఢిఫ్రెంట్ గా డిజైన్ చేసారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాపై అంచనాలు అయితే మాములుగా లేవు. అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం మరి కొన్ని రోజుల్లో అభిమానుల ముందుకు రాబోతుంది.

కాగా, ఈ సినిమా తరువాత తారక్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పోస్ట్ ప్రోడక్షన్స్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా కు సంబంధించిన పూజా కార్యక్రమం త్వరలోనే జరగనుందని అని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఫిక్స్ అయ్యింది.

ఈ మూవీ తరువాత తారక్ తన కెరీర్ లో 31 వ సినిమా గా రాబోతున్న మువీను లెటేస్ట్ సెన్సేషన్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తో ఫిక్స్ చేసుకున్నారు. ఇన్నాళ్ళు ఈ సినిమా ఉంటుందా ఉండదా అని తర్జన భర్జన పడిన మేకర్స్…ఎట్టకేలకు ఫైనల్ సినిమా లాంచింగ్ డేట్ ను ఫైనల్ చేసిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కన్నున్నట్లు తెలుస్తుంది.

బుచ్చిబాబు తారక్ కోసం సిద్ధం చేసిన ఈ కథలో తారక్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కబడ్డీ క్రీడాకారుడిగా కనిపించబోతున్నట్లు వినిపిస్తోంది. ఈ సినిమా అఫిషీయల్ అనౌన్స్మెంట్ కోసం మేకర్స్ డేట్ కూడా ఫిక్స్ చేశారని.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమాను ఏప్రిల్ 11వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఉప్పెన సినిమాతో సెన్సేషన్ విజయాన్ని సాధించిన దర్శకుడు బుచ్చిబాబు తన రెండవ సినిమా ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో చేస్తూ ఉండడంతో ఇక ఈ సినిమాపై రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి అని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news