Moviesచిన్న పిల్లలు లా మారిపోయిన రామ్ చరణ్-ఉపాసన(వీడియో)..నెట్టింట వైరల్..!!

చిన్న పిల్లలు లా మారిపోయిన రామ్ చరణ్-ఉపాసన(వీడియో)..నెట్టింట వైరల్..!!

మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ .. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేసే రేంజ్ కి వెళ్లిపోయాడు. నటనలో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకున్న ఈయన..రెమ్యూనరేషన్ లో మాత్రం తండ్రిని మించిన పారితోషకాని పుచ్చుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నాడు. మరి కొద్ది రోజుల్లో ఆయన తారక్ తో కలిసి నటించిన సినిమా ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ కాబోతుంది. దీంతో ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే దిశగా అభిమానులు రెడి అవుతున్నారు.

కాగా చరణ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గోంటూనే..శంకర్ తో ఓ సినిమాని చేస్తున్నాడు. అయితే కాస్త ఫ్రీ టైం దొరకడం తో భార్య ఉపాసన తో టూర్ కి వెళ్ళాడు ఈ యంగ్ హీరో. భార్య ఉపాసన గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎన్నో అవార్డులు ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఈమె..ఉపాసన కొణిదేల గా మారిన తరువాత ఆ పేరు కి మమ్రింత గౌర్వం వచ్చేలా నడుచుకుంటూ వస్తుంది. ఫస్ట్ నుండి ఉపాసన గురించి మనకు తెలిసిందే ఉన్నది ఉన్నట్లు మొహానే మాట్లాడేస్తుంది. తనకు అనిపించింది ఫేస్ మీదనే చెప్పడం చిన్నప్పటి నుండి ఉపాసన కి అలవాటు. చరణ్ అలా కాదు అలా చెప్పితే బాధ పడతారు ఏమో అనే స్వభావం కలవాడు. మరి వీళ్ల ఇద్దరికి జంట ఎలా కురిదింది అంటే..దానే ప్రేమ అంటారు.

అయితే, చరణ్ కి టైం దొరకడంతో రెండేళ్ల తర్వాత భర్త తో వెకేషన్ కు వెళ్తున్నాను అంటూ ఉపాసన ట్వీట్ చేసి తన ఆనందాని అభిమానులతో పంచుకుంది. కాగా , ఇక అక్కడ ఎలా ఎంజాయ్ చేశారో అభిమానులకు ఓ ఫన్నీ వీడియో రూపంలో పోస్ట్ చేసింది ఉపాసన. ఫిన్ లాండ్ లో ఉపాసనతో రామ్ చరణ్ ఫన్నీగా గడిపిన సన్నివేశాలు చూడటాని చాలా ముచ్చటగా అనిపించాయి.

ఆ ఎయిర్ పోర్టులో రామ్ చరణ్ ను ఉపాసన ట్రాలీపై కూర్చొపెట్టి అటు ఇటూ తిప్పడం, ఉపాసన మంచు తినడం..పెట్స్ తో ఆడుకోవడం..చిన్న పిల్లల మారిపోయి.. అక్కడ సరదాగా గడిపిన మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news