Moviesఎస్ ర‌ష్మీకి విడాకులు వ‌చ్చేశాయ్‌.. సుధీర్‌తో పెళ్లికి లైన్ క్లీయ‌ర్‌..!

ఎస్ ర‌ష్మీకి విడాకులు వ‌చ్చేశాయ్‌.. సుధీర్‌తో పెళ్లికి లైన్ క్లీయ‌ర్‌..!

ర‌ష్మీ తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు ఓ తిరుగులేని స్టార్ హీరోయిన్‌. ఎంతో మంది స్టార్ హీరోయిన్ల‌కు ల‌క్ష‌ల్లోనో.. కోట్ల‌లోనే ఫాలోవ‌ర్స్ ఉంటారు. అలాంటిది ర‌ష్మీ బుల్లితెర విష‌యంలో ఎంతో మంది హాట్ యాంక‌ర్లు ఉన్నా వారిని తోసిరాజ‌నీ మ‌రి తానే గ‌త కొన్నేళ్లుగా స్టార్‌గా ఉంటోంది. ఆమె స్టార్ పెర్పామ‌ర్‌.. స్టార్ హాట్ యాంక‌ర్‌.. ఇటు వెండితెర‌పై కూడా త‌ళ్లుక్కున మెరిసి స‌త్తా చాటుకుంది. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనే ఐటెం సాంగ్ చేసే స్థాయికి వెళ్లిపోయింది.

బుల్లితెర‌కు హాట్ ఇమేజ్‌, హాట్ యాంక‌ర్ అన్న ప‌దాల‌కు స‌రైన డెపినిష‌న్ ఇచ్చింది ర‌ష్మీయే. ఇక తాజాగా ర‌ష్మీ గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ అఫీషియ‌ల్‌గా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ర‌ష్మీకి ఇటీవ‌లే విడాకులు మంజూరు అయ్యాయి. ఒడిశా నేప‌థ్యం ఉన్న ర‌ష్మీ బుల్లితెర‌పై సెటిల్ అయ్యాక హైద‌రాబాద్‌లోనే ఉంటోంది. ప‌లు వ్యాపార సంస్థ‌ల‌కు అఫీషియ‌ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉండ‌డంతో పాటు కొన్ని వ్యాపార‌ల్లో చాలా పెట్టుబ‌డులు కూడా పెట్టింది.

ఇక ర‌ష్మీకి ఈ క్రేజ్ రావ‌డానికి ముందే నేవీలో ప‌నిచేసే ఓ వ్య‌క్తితో పెళ్ల‌య్యింది. అయితే ర‌ష్మీ ఇక్క‌డ బిజీ.. అత‌డేమో నేవీలో ఉంటాడు. ర‌ష్మీకి ఎవ‌రెవ‌రితోనే ఎఫైర్లు ఉన్నాయ‌ని వార్త‌లు ఎప్పుడూ వ‌స్తూనే ఉంటాయి. ఆమె ఉన్న‌ది గ్లామ‌ర్ ఫీల్డ్‌లు.. ఈ గాసిప్‌లు కామ‌న్‌. కానీ భ‌ర్త‌తో ఎక్క‌డో తేడా కొట్టింది.. వాళ్లిద్ద‌రు కలుసుకున్న సంద‌ర్భాలూ త‌క్కువే. మొత్తానికి ఇటీవ‌లే విడాకులు తీసేసుకుంది.

ఇప్పుడు ఆమె కూడా స‌మంత‌లాగా ఓ స్వేచ్ఛా ప‌క్షి. అయితే ఇటీవ‌లే ఆమె మ‌రో వ్య‌క్తిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంద‌న్న వార్త‌లూ వ‌చ్చాయి. అవ‌న్నీ అబద్ధం. అయితే త‌న‌కు సుడిగాలి సుధీర్‌తో మంచి కెమిస్ట్రీ ఉంద‌న్న‌ది వాస్త‌వం. అయితే దానిని త‌ప్పుప‌ట్ట‌లేం. ప‌దేళ్ల నుంచి తెర‌మీద వీరి ప్రేమాయ‌ణం, కెమిస్ట్రీ ఎంత పాపుల‌రో తెలిసిందే. ఇక సుధీర్ స్టిల్ బ్ర‌హ్మ‌చారి.

ఇక లేటెస్ట్ టాక్ ప్ర‌కారం వాళ్లిద్ద‌రు అధికారికంగా ఒక్క‌టి కాబోతున్నార‌ట‌. నిజంగా వాళ్లు పెళ్లి చేసుకుంటే చాలా మందికి సంతోషం. కొద్ది నెల‌ల్లోనే వీరు ఒక్క‌టి అవుతున్నార‌న్న వార్త అయితే బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. మ‌రి ఏం జ‌రుగుతుందో ? వీరి ఇద్ద‌రి లైఫ్లో ఇంకెన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news