Moviesఅలియాభ‌ట్ - ఎన్టీఆర్ అదిరిపోయే ఐడియా... తార‌క్ ఫ్యాన్స్ అస్స‌లు త‌గ్గ‌రుగా...!

అలియాభ‌ట్ – ఎన్టీఆర్ అదిరిపోయే ఐడియా… తార‌క్ ఫ్యాన్స్ అస్స‌లు త‌గ్గ‌రుగా…!

ఆర్ఆర్ఆర్ రిజ‌ల్ట్ వ‌చ్చేసింది. సినిమాకు యునాన‌మ‌స్ బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్ అయితే వ‌చ్చేసింది. సినిమా ఇప్ప‌టికే రు. 500 కోట్ల క్ల‌బ్‌లో చేరిపోయింది. రు. 1000 కోట్లు కూడా సింపుల్‌గా దాటేసేలా ఉంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ మూడేళ్ల‌కు పైగా క‌ష్ట‌ప‌డ్డాడు. అయితే ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా రేంజ్‌లో రావాల్సిన క్రేజ్ అయితే రాలేదు. ఎన్టీఆర్‌కు ఈ మూడేళ్ల క‌ష్టానికి త‌గిన పాన్ ఇండియా ఇమేజ్ అయితే వ‌స్తుంద‌ని ఆశించిన ఆయ‌న అభిమానులు కూడా కాస్త డిజ‌ప్పాయింట్ అయ్యారు.

ఇక ఇప్పుడు కొర‌టాల శివ సినిమా విష‌యంలో మాత్రం ఎన్టీఆర్ ఎక్క‌డా రాజీప‌డేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఈ సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియా ఇమేజ్ రావాల‌ని ముందు నుంచే ప్లానింగ్‌తో ఉన్నాడు. అందుకే అలియాభ‌ట్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. త్రిబుల్ ఆర్ సినిమాలోనూ అలియా ఉంది. అయితే ఆమె చ‌ర‌ణ్‌కు జోడీగా సీత పాత్ర‌లో క‌నిపించింది. ఆమె పాత్ర‌కూ ఈ సినిమాలో అనుకున్నంత ప్రాధాన్యం లేదు.

అందుకే ఆమె రాజ‌మౌళిపై అలిగింద‌న్న టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇక ఎన్టీఆర్ – కొర‌టాల మూవీలో అలియాను తీసుకోవ‌డం కేవ‌లం పాన్ ఇండియా ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకునే అంటున్నారు. తెలుగు వ‌ర‌కు మాత్ర‌మే అంటే అలియాభ‌ట్‌కు అంత రెమ్యున‌రేష‌న్ ఇచ్చి ఖ‌చ్చితంగా తీసుకోరు. ఏదేమైనా త్రిబుల్ ఆర్ కోసం మూడేళ్లు క‌ష్ట‌ప‌డ్డ ఎన్టీఆర్ త‌నకు పాన్ ఇండియా ఇమేజ్ రావ‌డంతో పాటు నార్త్‌లో మార్కెట్ పెరుగుతుంద‌నే ఆశ‌ప‌డ్డాడు.

 

అయితే త్రిబుల్ ఆర్ హిట్ అయినా.. ఎన్టీఆర్ అనుకున్న అంచ‌నాలు అయితే నెర‌వేర‌లేదు. ఇక ఇప్పుడు కొర‌టాల సినిమాతో ఆ ఇమేజ్‌ను స్ట్రాంగ్ చేసుకునే ప్లాన్‌లోనే ఉన్నాడు. కొర‌టాల సినిమాతో అయినా ఎన్టీఆర్ కు ఫాన్ ఇండియా ఇమేజ్ వస్తే తారక్ ఫ్యాన్స్‌కు అంత‌కు మించిన ఆనందం మ‌రొక‌టి ఉండ‌దు.
ఎందుకంటే త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ సినిమా ఉంది. ప్ర‌శాంత్ నీల్ సినిమా అంటే భారీ పాన్ ఇండియా సినిమాయే..! ఇక కొర‌టాల సినిమాను క‌ళ్యాణ్‌రామ్‌తో పాటు మిక్కిలినేని సుధాక‌ర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news