Moviesస‌మంత ఇన్‌స్టా గ్రామ్ ఆదాయం చూస్తే మైండ్ పోవాల్సిందే... ఒక్కో పోస్టుకు...

స‌మంత ఇన్‌స్టా గ్రామ్ ఆదాయం చూస్తే మైండ్ పోవాల్సిందే… ఒక్కో పోస్టుకు అన్ని ల‌క్ష‌లా…!

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్నాక సమంత క్రేజ్‌ మరింత పెరిగిపోయింది. వ‌రుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోతోంది. ఓ వైపు గుణ‌శేఖ‌ర్ శాకుంత‌లం పూర్తి చేసుకుంది. ఇప్పుడు య‌శోద అనే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌కు రెడీ అవుతోంది. అస‌లు ఇంకెన్ని సినిమాలు లైన్లో పెడుతుందో అర్థం కావ‌డం లేదు. బాలీవుడ్‌లో రెండు వెబ్‌సీరిస్‌లు చేస్తోంది. ఇటు కోలీవుడ్‌లో కార్తీ స‌ర‌స‌న ఓ సినిమాకు ఓకే చెప్పింది. టాలీవుడ్‌లోనే రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌క్క‌న కూడా ఓ రొమాంటిక్ ల‌వ్‌స్టోరీకి ఓకే చెప్పింది.

అటు హాలీవుడ్‌లో ఆమె న‌టించే సినిమా టెస్ట్ షూట్ కూడా జ‌రిగింది. స‌హ‌జంగా పెళ్ల‌య్యాక ఏ హీరోయిన్‌కు అయినా అవ‌కాశాలు త‌గ్గిపోతాయి. అయితే స‌మంత విష‌యంలో ఇది రివ‌ర్స్ అవుతోంది. పెళ్ల‌య్యి.. విడాకులు తీసుకున్నాక ఆమెకు మ‌రింత‌గా ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. ఇక స‌మంత ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. విడాకుల త‌ర్వాత ఆమె సోష‌ల్ మీడియాలో మ‌రింత‌గా రెచ్చిపోతోంది.

అయితే త‌న‌కున్న క్రేజ్‌ను వాడుకుని.. స‌మంత సోష‌ల్ మీడియా ద్వారా కూడా భారీగానే ఆర్జిస్తోంద‌ట‌. స‌మంత ఇన్‌స్టా గ్రామ్ ద్వారా ఎంత ఆర్జిస్తుంద‌నేది ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీనిపై పెద్ద ఎత్తునే చ‌ర్చ న‌డుస్తోంది. స‌మంత త‌న్ ఇన్ స్టా కాతాలో ఒక్కో క‌మ‌ర్షియ‌ల్ యాడ్ పోస్ట్ చేయాలంటే పోస్ట‌కు రు. 15 నుంచి రు. 20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిమాండ్ చేస్తోంద‌ట‌. ఇదే నిజ‌మైతే ఇది మామూలు డిమాండ్ కాద‌నే చెప్పాలి.

ఒక్కో పోస్ట్‌కే ఇంత తీసుకుంటే.. ఇక నెల‌కు ఆమెకు ఆదాయం కోట్ల‌లోనే ఉంటుంది. ఇక ఒక్కో పోస్ట్‌కు మాత్ర‌మే స‌మంత తీసుకునే రేటు ఇది. ఇక స్పెష‌ల్‌గా ఫొటో షూట్స్‌, వీడియోలు చేయాల్సి వ‌స్తే అందుకు అద‌నంగా రెండు, మూడు రెట్లు ఉంటుంద‌ట‌. ఇక ఇప్పుడు ఒక్కో సినిమాకు స‌మంత రు. 3 కోట్లు తీసుకుంటోంది. రు. 2.5 ఇస్తాన‌న్నా కూడా నో చెప్పేస్తోంది. ఇక ఓవ‌రాల్‌గా అటు సినిమాలు.. ఇటు సోష‌ల్ మీడియా పోస్టుల ద్వారా.. బ‌య‌ట బ్రాండ్స్ అంబాసిడ‌ర్‌గా చూస్తే స‌మంత ఆదాయం మామూలుగా ఉండ‌ద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news