Moviesసినిమా ప్లాప్ అని ముందే తెలిసి కూడా ఎన్టీఆర్ చేసినా సినిమా...

సినిమా ప్లాప్ అని ముందే తెలిసి కూడా ఎన్టీఆర్ చేసినా సినిమా ఇదే…!

దివంగత విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ ఏదైనా ఒక పని అనుకున్నారు అంటే ఆ పని పూర్తయ్యే వరకు అసలు నిద్రపోయేవారు కాదు. ఇక సినిమా విషయంలో ఎంతో నిబద్ధతతో ఉంటారో ? పని పట్ల ఆయనకు ఉన్న అంకితభావానికి ఇండస్ట్రీ అంతా షాక్‌ అయ్యేది. ఒక సినిమా షూటింగ్ ఉంది అంటే ఉదయం ఆరు గంటలకే ఆయన సెట్లో ఉండేవారు. ఆయన క్రమశిక్షణ ముందు ఎవరు సాటి వచ్చే వారే కాదు. ఎన్టీఆర్ సెట్ లో ఉన్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండే వారు. మరి కొందరు అయితే భయంతో వణికిపోయే వారు. జానపదం – పౌరాణిక, సాంఘిక, చారిత్రక పాత్రల‌లో ఆయ‌న పరకాయ ప్రవేశం చేస్తారు.

ఏదైనా కొత్త పాత్ర చేయాలని ఎన్టీఆర్ మనసులో అనుకున్నారు అంటే ఆయన అసలు వెనక్కు తగ్గ‌రు. పట్టుదల విషయంలో ఎన్టీఆర్ ఎలా ఉంటారో ? దానవీరశూరకర్ణ సినిమా నిదర్శనం. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ కురుక్షేత్రం సినిమాకు పోటీగా దానవీరశూరకర్ణ సినిమా కేవలం 28 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ కు ఒకసారి మనసులో మ‌హాక‌వి శ్రీనాథుడి కథను సినిమాగా తీయాలన్న ఆలోచన వచ్చింది. ఆయన వెంటనే ఇదే విషయాన్ని బాపు-రమణ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే వారిద్దరూ శ్రీనాథుడి జీవితంలో పెద్ద కథ ఉండదు… సామాన్యులకి ఆయన ఎవరో తెలియదు.. దాన్ని సినిమాగా తీయటం కష్టం… పైగా ఆర్థికంగా కూడా నష్టపోవాల్సి వస్తుంది అని ఎన్టీఆర్ కు సూచించారు.

అయితే ఎన్టీఆర్ మాత్రం తనకు నష్టం వచ్చినా ఇబ్బంది లేదు… మనం ఖచ్చితమైన శ్రద్ధతో సినిమా చేద్దాం అది ప్రజా ఆదరణ పొందక పోయినా ఇబ్బంది లేదు… కొందరు మాత్రమే ఆ సినిమా చూసి తృప్తి పడినా చాలు.. శ్రీనాథుడి పాత్ర ధరించాలన్నదే నా కోరిక అని చెప్పారట ఎన్టీఆర్. వెంటనే బాపు దర్శకత్వంలో ఎన్టీఆర్ – జయసుధ జంటగా శ్రీనాథ కవి సార్వభౌముడు సినిమా తెరకెక్కింది. కె వి మహదేవన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమాలో పాటలకు మంచి పేరు వచ్చినా సినిమా మాత్రం ప్రజాదరణ పొందలేక పోయింది. అయితే శ్రీనాథుడు పాత్ర‌లో నటించాలన్న ఎన్టీఆర్ కోరిక ఈ సినిమాతో నెరవేరింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news