Moviesతాత ఎన్టీఆర్ మొండిత‌న‌మే తార‌క్‌కూ వ‌చ్చిందా.. ఆ సినిమాయే బెస్ట్ ఎగ్జాంపుల్‌..!

తాత ఎన్టీఆర్ మొండిత‌న‌మే తార‌క్‌కూ వ‌చ్చిందా.. ఆ సినిమాయే బెస్ట్ ఎగ్జాంపుల్‌..!

సీనియర్ ఎన్టీఆర్ ఎంత మొండి వారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఒక పని చేయాలని సంకల్పించినప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా మొండి ఘటంగా వ్యవహరిస్తూ ఆ పని పూర్తి చేసేవారు. తెలుగు ప్రజలు కూడా రూపంలో ఆ తారక రాముని నుదుటి నుంచే ఈ తారకరాముడు ఉద్భవించాడు అని కూడా చెబుతూ ఉంటారు. నటనలోనూ తన తాత స్టైల్‌ను ఒక్కోసారి అనుకరిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే ఆది సినిమాకు పరుచూరి బ్రదర్స్ డైలాగులు రాశారు. ఆ సినిమా నిర్మాత బెల్లంకొండ సురేష్ సోద‌రి నాగ‌ల‌క్ష్మి ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఈ సినిమాకు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ చేత డైలాగులు రాయించార‌ట‌.

ఈ సినిమాకు డైలాగులు రాసిన సందర్భంలో తనకు ఎదురైన అనుభవాన్ని పరుచూరి గోపాలకృష్ణ ప‌రుచూరి ప‌లుకులు కార్యక్రమంలో పంచుకున్నారు. ఆది సినిమా డైలాగ్స్ రీడింగ్ చేస్తున్నప్పుడు పరుచూరి గారి రెండో అమ్మాయి నాగ సుష్మా ఇది బాలకృష్ణ గారి స్క్రిప్ట్‌లా ఉంది.. మ‌రి తార‌క్‌ చిన్నోడు కదా అన్న సందేహం వ్యక్తం చేసిందట. వెంటనే ఆయ‌న అది నందమూరి తారకరామారావు గారి ర‌క్తం… అది ఎవరు చెప్పినా ఆ డైలాగ్ అలాగే పండుతుంది.. కంగారు పడొద్దు అని సూచించారట.

ఇక విశాఖపట్నంలో సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతున్నప్పుడు తారక్ చేయికి గ్లాస్ త‌గిలి దెబ్బ తగిలి.. అప్పుడు షూటింగ్ ఆగిపోయింది. అప్పుడు ప‌రుచూరి గారు షూటింగ్ ఆపేసారా ? అని వినాయక్‌ని అడిగారట. వెంట‌నే లేదు సర్.. తార‌క్ షూటింగ్ చేస్తున్నాడు అని చెప్పాడు అని వినాయ‌క్‌ అన్నారట.
ఆ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ మొండితనం తనకు కనబడింది అని.. సర్దార్ పాపారాయుడు సినిమా క్లైమాక్స్ లో కూడా అన్నగారి చేతికి దెబ్బ తగిలినా కూడా.. షూటింగ్ ఆపకుండా పూర్తిచేశారని నాటి సంగ‌తిని ప‌రుచూరి గుర్తు చేసుకున్నారు.

చేతికి దెబ్బ త‌గిలినంత మాత్రానా షూటింగ్ ఎందుకు ఆపాల‌ని ఎన్టీఆర్ ప్ర‌శ్నించార‌ట‌. ఆ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో.. ఆది కూడా అంతే బ్లాక్ బస్టర్ హిట్ అయిందని పరుచూరి తెలిపారు. ఇక 2002 మార్చి 28న రిలీజ్ అయిన ఆది ఏకంగా 98 కేంద్రాల్లో 100 రోజులు ఆడి పెద్ద సంచ‌ల‌నం క్రియేట్ చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news