Moviesవావ్: మహేష్‏ సినిమా లో ఆ స్టార్ హీరో..ఇప్పుడు ఫ్యాన్స్ కు...

వావ్: మహేష్‏ సినిమా లో ఆ స్టార్ హీరో..ఇప్పుడు ఫ్యాన్స్ కు అసలైన మజా..?

టాలీవుడ్ లో ఎటువంటి కాంట్రవర్షీయల్ జోలీకి పోకుందా..కూల్ గా తన దైన స్టైల్ లో సినిమాలు చేసుకుపోతున్నాడు మహేష్ బాబు. చూడటానికి ఎంత సైలెంట్ గా ఉంటాడో..ఒక్కసారి కదిలిస్తే అంతా బాగా మాట్లాడతారు. జాలీగా ఉంటారు. సెటైర్స్ వేస్తారు. రీసెంట్ గా ఆయన బాలయ్య షో కి వచ్చి చేసిన సందడి మనం కళ్లారా చూసాం. ప్రస్తుతం ఈయన డైనమిక్ డైరెక్టర్ పరశూరాం డైరెక్షన్ లో “సర్క్కారు వారి పాట” అనే సినిమా చేస్తున్నాడు. ఈ మధ్యనే ఈ సినిమా నుండి కలావతి అనే పాట రిలీజై ఎంటటి ఘన విజయాని అందుకుందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా త్వరలోనే మన ముందుకు రాబోతుంది.

 

కాగా ఈ సినిమా తరువాత మహేష్ బబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా కు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. వచ్చే నెల నుంచి ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మహేష్ బాబు పక్కన పూజా హెగ్డే నటిస్తుంది. ఇది వరకే వీళ్ళ కాంబినేషన్ లో మహర్షి అనే సినిమా రిలీజ్ అయ్యి ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. మళ్లీ ఈ జోడీ రీపీట్ అవుతుందనే సరికి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, ఈ సినిమాలో రెండో హీరోయిన్ కూడా ఉందని దాని కోసం మలయాళీ ముద్దు గుమ్మ సం యుక్తా మీనన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

కాగా ఈ సినిమా కి సంబంధించిన క్రేజీ రూమర్ ఒకటి మీడియా తెగ హల్ చల్ చేస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబుని ఢీ కొట్టే పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించనున్నారట. ఇప్పటికే ఈ సినిమా స్టోరీని విన్న ఆయన.. పాత్ర బాగా నచ్చడంతో ఓకే చేశారని తెలుస్తుంది.ఇక ఈ విలన్ పాత్రకి ఆయన అయితేనే బాగుంటాడని అంటున్నారు. త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన రానున్నట్లుగా సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news