Moviesహవ్వా..రోజా దారుణమైన బూతు సామెత..బార్డర్ క్రాస్ చేస్తున్న జ‌బ‌ర్ద‌స్త్ షో..!!

హవ్వా..రోజా దారుణమైన బూతు సామెత..బార్డర్ క్రాస్ చేస్తున్న జ‌బ‌ర్ద‌స్త్ షో..!!

తెలుగు బుల్లితెరపై ఇప్పుడు టాప్ పొజీషన్లో నడుస్తున్న ప్రొగ్రామ్ ‘జబర్ధస్త్’కామెడీ షో . బుల్లితెరలో జబర్దస్థ్ షో ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలిసిందే. ఎన్నో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు ప్రసారమవుతున్నా కానీ ఈ షో కి ఉన్న క్రేజ్ రేంజ్ రెండూ వేరే లేవల్. ఈ ప్రోగ్రామ్ ఎంత ఆదరణ పొందుతుంతో..అంతే విమర్శలకు గురి అవుతుంది. గతంలో ఈ ప్రోగ్రామ్ లో అసభ్యకరమైన స్కిట్ లు చేసి జనాల చేత తన్నులు తిన్న సంఘటనలు కూడా ఉన్నాయి. బుల్లితెరపై తన ప్రతాపం చూపిస్తున్న షో జబర్దస్త్..ఎన్ని షో లుపోటీగా వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా నిరంతరాయంగా ఈ షో సాగుతూనే ఉంది.. ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.. వారిని కడుపుబ్బా నవ్విస్తూనే ఉంది.

ఇక కామెడీ షో గా వస్తున్న జబర్దస్త్ ప్రోగ్రాం గురించి, అందులో వచ్చే కామెడీ పంచ్ ల గురించి ఆ షో చూసిన వారికి తెలుస్తుంది. జబర్దస్త్ షో అంటే డబుల్ మీనింగ్‌లకు పెట్టింది పేరు. ఒకప్పుడు స్కిట్లలో చేష్టలు, మాటలు, సెటైర్లు శ్రుతి మించిపోయాయి. జనాలందరూ గగ్గోలు పెట్టారు. షోను బ్యాన్ చేయాలంటూ రచ్చ రచ్చ చేశారు. ఆ తరువాత ఆ డబుల్ మీనింగ్‌ల గోల కాస్త తక్కువైంది. కానీ మళ్ళీ కొన్ని వారాల నుండి ఆ వల్గర్ పంచ్ లు ఎక్కువైయాయి.

జబర్దస్త్ ప్రోగ్రాంలో డబుల్ మీనింగ్ డైలాగులు ఓ రేంజ్ లో ఉంటాయని తెలిసిందే. కానీ అవి శృతిమించకుండా ఉంటే బాగుంటుంది అంటున్నారు షో చూసే జనాలు. ఒకపక్క ఎమ్మెల్యేగా బిజీగా ఉంటూనే మరో పక్క జబర్దస్త్ టీవీ షోతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తుంది నటి, ఎమ్యెల్యే రోజా.ఇదిలా ఉంటే తాజాగా జబర్దస్థ్ లో రోజా చెప్పుదామని చెప్పలేక ఆగిపోయిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ కు అభిమానులు షాక్ అవుతున్నారు. తాజాగా విడుద‌లైన జ‌బ‌ర్ద‌స్త్ ప్రోమోలో రోజా మంగళవారం సామెత హాట్ టాపిక్ గా మారింది.

ఈ వారానికి సంబంధించిన ప్రోమోను జబర్సద్థ్ టీం వాళ్ళు తాజాగా రిలీజ్ చేసారు. ఇక అందులో తాగుబోతు రమేష్ ని స్కిట్ లో భాగంగా..తన భార్య తల్లో పూలు పెట్టుకుని..అందంగా రెడీ అయి కొంటె గా చూస్తూ..ఏవండీ అంటూ సైగ చేస్తుంది. ఇంతలో మన రమేష్..అబ్బా ఈ రోజు మగళవారమే అంటాడు. అయ్యో కాదండీ ఈరోజు గురువారం అని అని ఆ భార్య ఆత్రంగా అడుగుతున్నా.. లేదు ఈరోజు మంగళవారం అని వాచ్ చూపిస్తుంటాడు.

దీంతో మధ్యలో మ్యాటర్ లోకి ఎంటర్ అయిన రోజా..నాకు అదేదో మగళవారం సామెత గుర్తు వస్తుంది అంటుంది. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారు షాక్ అవుతారు. వాళ్ళే కాదు ఈ ప్రోమో చూసిన వారు కూడా షాక్ అయ్యరు. రొజా చెప్పలేకపోయినా ఆ మంగళవారం సామెత ఏంటో… దాని అర్ధం ఏంటో అందరికీ తెలిసే ఉంటుంది. రోజు రోజు కి జబర్దస్థ్ లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ శృతిమించిపోతున్నాయి అంటూ తిట్టిపోస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news