Moviesఆ థియేట‌ర్లో న‌ర‌సింహానాయుడు 300 డేస్‌... ఇండ‌స్ట్రీలో బాల‌య్య ఒక్క‌డిదే ఆ...

ఆ థియేట‌ర్లో న‌ర‌సింహానాయుడు 300 డేస్‌… ఇండ‌స్ట్రీలో బాల‌య్య ఒక్క‌డిదే ఆ రికార్డ్‌..!

యువరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్లో తిరుగులేని బ్లాక్ బస్టర్ నరసింహ నాయుడు. 2001 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. భారతదేశ సినీ చరిత్రలో 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన తొలి సినిమాగా నరసింహనాయుడు అదిరిపోయే రికార్డును సొంతం చేసుకుంది. ఆ సంక్రాంతికి చిరంజీవి మృగరాజు – వెంకటేష్ దేవి పుత్రుడు సినిమాలు వ‌చ్చాయి. నరసింహనాయుడు ఆ రెండు సినిమాలను తన దరిదాపుల్లోకి రాకుండా ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. బి.గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 105 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఈ సినిమా 19 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది.

అప్పట్లో నరసింహనాయుడు సినిమా చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా వంద రోజులు ఆడింది. ఆ ప‌ల్లెల్లో ఈ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఈ క్రమంలోనే ఓ కొత్త థియేటర్ నరసింహనాయుడు సినిమాతోనే ఓపెన్ అయ్యింది. నరసింహ నాయుడు పుణ్యమా అని ఆ కొత్త థియేటర్లో 300 రోజుల పాటు ఆ సినిమా ఆడటం తెలుగు సినిమా చరిత్రలో అరుదైన రికార్డుగా నిలిచిపోయింది. ఇన్ని సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో కొత్త థియేటర్ లో రిలీజ్ అయిన ఏ సినిమా కూడా ఇన్ని రోజులు ఆడలేదు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణకు అంబికా కాంప్లెక్స్ థియేటర్లు ఉన్నాయి.

అంబికా కృష్ణ నిర్మాత కూడా..! బాల‌య్య‌కు అభిమాని అయిన ఆయ‌న ఆయ‌న‌తో వీర‌భ‌ద్ర సినిమా నిర్మించారు. ఆయ‌న‌కు అప్పట్లో అంబికా థియేటర్ ఒక్క‌టే ఉండేది. అదే కాంప్లెక్స్ లో అంబికా మినీ థియేటర్ నిర్మించారు. నరసింహ నాయుడు సినిమాతో ఈ థియేటర్ ప్రారంభమయింది. ఈ సినిమాకు తిరుగులేని బ్లాక్‌బ‌స్టర్ టాక్ రావడంతో 100 రోజులపాటు హౌస్ఫుల్ కలెక్షన్లతో నడిచింది. ఆ తర్వాత 200 రోజులు ఆడిన‌ ఈ సినిమా ఆ థియేటర్లో డైరెక్ట్ గా 275 రోజులు పూర్తి చేసుకుంది. విచిత్రమేంటంటే అంబికా మినీలో ఈ సినిమా అవుతుండగానే అదే కాంప్లెక్స్‌లో కొత్తగా అంబిక లిటిల్ థియేటర్ కూడా ప్రారంభమైంది. ఆ తర్వాత అంబిక లిటిల్ లోకి షిఫ్ట్ అయిన నరసింహనాయుడు ఓవ‌రాల్‌గా అంబికా కాంప్లెక్స్ లో 300 రోజులు ఆడింది.

ఆ తర్వాత ఏలూరు టు టౌన్ లోని ర‌మామ‌హాల్‌కు షిఫ్ట్ అయిన ఈ సినిమా ఆ థియేటర్లో కూడా 40 రోజులకు పైగా ఆడింది. అలా ఏడాది పాటు నరసింహనాయుడు ఏలూరులో పలు థియేటర్లు మారుతూ ఆడుతూనే ఉంది. ఈ సినిమా వంద రోజులు దాటిన వెంటనే బాలకృష్ణ నటించిన మరో సినిమా భలేవాడివి బాసు కూడా రిలీజ్ అయింది. భలేవాడివి బాసు 50 రోజులు పూర్తి చేసుకుని థియేటర్ల నుంచి వెళ్లిపోయినా నరసింహనాయుడు ప్రభంజ‌నం మాత్రం ఏడాది పాటు కంటిన్యూ అయ్యింది. ఓ కొత్త థియేటర్ లో రిలీజ్ అయిన నరసింహనాయుడు ఇన్ని రోజులు ఆడటం టాలీవుడ్ సినీ చరిత్రలో అరుదైన రికార్డుగా నిలిచిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news