Moviesఎన్టీఆర్‌ పక్కన లేడీ ఐటెం బాంబ్..ఈసారి ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదుగా...

ఎన్టీఆర్‌ పక్కన లేడీ ఐటెం బాంబ్..ఈసారి ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదుగా ..?

నందమూరి నటవారసుడు ..యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా అది తక్కువే. ఆయన నటనను చూసే కాదు, వ్యక్తిగత విషయాలను చూసి కూడా ఆయనకు ఫ్యాన్స్ గా మారిన వాళ్లు బోలెడు మంది. ఎన్టీఆర్‌ అంటే నందమూరి అభిమానులకు చాలా ఇష్టం..ఇంకా చెప్పాలంటే ప్రాణం. తమ ఇంట్లో ని వాడిగా భావిస్తారు. ఎందుకంటే ఎన్టీఆర్ సౌమ్యుడు.. నవ్వుతూ పలకరిస్తాడు..ఫ్యాన్స్‌ను ఫ్యామిలీ మెంబర్స్‌గా భావిస్తారనే మంచి పేరు పేరుంది. ఇక ఆడియో ఫంక్షన్స్, ప్రీరిలీజ్ ఈవెంట్స్‌కు వచ్చే అభిమానులను జాగ్రత్తలు చెబుతాడు.

కాగా, గతంలో తారక్ ఏడాదికి రెండు సినిమాలు చేసే తారక్..ఇన్నాళ్లు రాజమౌళి సినిమాకు కమిట్ అయ్యి ఆర్ ఆర్ ఆర్ సినిమాకే టోటల్ టైం ను ఇచ్చేసాడు. ఇప్పుడు తారక్ ఫ్రీ బార్డ్. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న తారక్..ఆ తరువాత వరుసగా బడా బడా డైరెక్టర్స్ తో సినిమాలకు కమిట్ అయ్యాదు. దీంతో రానున్న మూడు ఏళ్ళు తారక్ కాల్ షీట్లు ఫుల్ బిజీ బిజీ గా ఉండనున్నాయి. అయితే, వీరి కాంబోలో ఇంతకు ముందు వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే హైలైట్‌గా నిలిచింది. మరోసారి బంపర్ హిట్ కొట్టేందుకు కొరటాల సూపర్ స్కెచ్ వేశాడని గుసగుసలు వినబడుతున్నాయి. ఈ సినిమా గురించి ఇప్పటికే రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉండగా తాజాగా ఈ సినిమా కి సంబంధించి ఒక వార్త వెలుగులోకి వచ్చింది.

#NTR30 వర్కింగ్ టైటిల్‌ గా రానున్న ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ ని దింపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్‌లో అలియాభ‌ట్ క‌నిపించ‌నుంద‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ వార్త‌ల‌ను నిజం చేస్తూ రీసెంట్ గానే ఆలియా అప్ డేట్ ఇస్తూ..తారక్ పక్కన నటిస్తున్నట్లు చెప్పి అభిమానుల్లో భారీఅంచనాలను నెలకోల్పింది.

ఇక ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం డైరెక్టర్ పూరి జగన్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన లోఫర్ సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన దిశా పటానీని ఫైనల్ చేసిన్నట్లు జోరుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా అధికారిక ప్రకటన మినహా ఈ సినిమా నుంచి మరెలాంటి ప్రకటన వెలువడక పోవడంతో ఈ సినిమాలో నటించే వారి గురించి రకరకాల ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి. కొర‌టాల ఈ సారి కొత్త సాంకేతిక నిపుణుల బృందంతో క‌లిసి పనిచేయ‌బోతున్నాడ‌ని టాక్. అలియాభ‌ట్‌, ఎన్టీఆర్ కాంబోలో ఆర్ఆర్ఆర్ సినిమా వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చిత్రంలోఅలియా భ‌ట్ మాత్రం రాంచ‌ర‌ణ్‌కు జోడీగా న‌టించింది. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news