Moviesబ్రేకింగ్‌: పవర్ ఫుల్‌గా #NBK107 ఫస్ట్ లుక్‌

బ్రేకింగ్‌: పవర్ ఫుల్‌గా #NBK107 ఫస్ట్ లుక్‌

బాలకృష్ణ కెరీర్‌ను ఈ వ‌య‌స్సులో కూడా స్వింగ్ చేసేసిన సినిమా అఖండ‌. కేవ‌లం థియేట్రిక‌ల్ ర‌న్‌లోనే రు. 150 కోట్లు వ‌సూలు చేసిన ఈ సినిమా ఓవ‌రాల్‌గా రు. 200 కోట్లు కొల్ల‌గొట్టింది. ఏపీలో టిక్కెట్ల రేట్లు త‌క్కువుగా ఉన్నా కూడా అఖండ ఈ రేంజ్‌లో వ‌సూళ్లు సాధించ‌డం.. బాల‌య్య‌కు కాస్త త‌క్కువ మార్కెట్ ఉన్న నైజాంలో ఓ ఊపు ఊపేయ‌డం ఇండ‌స్ట్రీతో పాటు ట్రేడ్ వ‌ర్గాల‌కు సైతం పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పుడు మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య ప‌వ‌ర్ ఫుల్ మాసివ్ క‌థ‌తో ఓ సినిమా చేస్తున్నాడు.

మైత్రీ మూవీస్ నిర్మించే ఈ సినిమాలో శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. బాలయ్య లుక్స్ చాలా ఇంటెన్స్‌గా ఉన్నాయ‌నే చెప్పాలి. బ్లాక్ సూట్‌లో బాల‌య్య డాప‌ర్‌గా క‌నిపిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మూడు రోజుల క్రితం తెలంగాణ‌లోని సిరిసిల్ల‌లో స్టార్ట్ అయ్యింది. ఈ షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయిన లుక్‌లోనే బాల‌య్య చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా మాసివ్ లుక్‌లో క‌నిపించాడు.

ఇక ఇప్పుడు మేక‌ర్స్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన నాలుగు రోజుల‌కే ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌లో జోష్ నింపేశారు. ఇక ఈ సినిమా క‌న్న‌డ సీనియ‌ర్ హీరో శివరాజ్ కుమార్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మఫ్టీ అనే ఒక యాక్షన్ థ్రిల్లర్‌కు ఓ రీమేక్ అన్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమాకు రామ్ – ల‌క్ష్మ‌ణ్ కొరియోగ్ర‌ఫీ అందిస్తున్నారు. కోలీవుడ్ హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news