Moviesబాల‌య్య - అనిల్ రావిపూడి సినిమా ఇంత సంచ‌ల‌న‌మా..!

బాల‌య్య – అనిల్ రావిపూడి సినిమా ఇంత సంచ‌ల‌న‌మా..!

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ఈ వ‌య‌స్సులో ఇంత జోష్‌లో ఉండ‌డం నిజంగా గ్రేటే. అఖండ ఏ ముహూర్తాన రిలీజ్ అయ్యిందో కాని.. ఇప్ప‌ట‌కీ 80 రోజులు దాటుతున్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో అఖండ మానియా కొన‌సాగుతూనే ఉంది. ఈ సినిమా రు. 200 కోట్ల వ‌సూళ్లు దాటేసి.. ఇటు డిస్నీ + హాట్‌స్టార్‌లో రిలీజ్ అయ్యి ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేసినా ఇంకా కొన్ని చోట్ల స‌క్సెస్ ఫుల్‌గా థియేట‌ర్ల‌లో ర‌న్ అవుతూనే ఉంది.

మ‌రోవైపు అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిందో చూశాం. ఇప్పుడు జూన్ నుంచి అన్‌స్టాప‌బుల్ రెండో సీజ‌న్ కూడా ప్రారంభించే ప్ర‌య‌త్నాలు చేస్తోంది ఆహా టీం. ఇక అఖండ గ‌ర్జ‌న చేసిన బాల‌య్య ఇప్పుడు క్రాక్‌తో ఫామ్‌లోకి వ‌చ్చిన మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మైత్రీ మూవీస్ వాళ్లు భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నారు.

ఈ సినిమా ఫినిష్ అయిన వెంట‌నే బాల‌య్య – అనిల్ రావిపూడి సినిమా కూడా ప‌ట్టాలెక్క‌నుంది. ఈ కాంబోలో సినిమా కోసం గ‌త మూడు , నాలుగేళ్లుగా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతూనే ఉన్నాయి. అనిల్ రావిపూడి ఓ క‌థ రెడీ చేసుకుని బాల‌య్య‌కు వినిపించ‌డంతో పాటు రామారావు గారు అనే టైటిల్ కూడా అనుకున్నాడు. అది ఎందుకో ? గాని సెట్ కాలేదు. ఆ త‌ర్వాత చెప్పిన క‌థ బాల‌య్య‌కు బాగా న‌చ్చ‌డంతో ఓకే చెప్పేశాడు.

మ‌లినేని గోపీచంద్ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే అనిల్ రావిపూడి సినిమా ప‌ట్టాలు ఎక్క‌నుంది. ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. అది పూర్త‌యిన వెంట‌నే బాల‌య్య సినిమా క‌థ‌పై క‌స‌ర‌త్తులు స్టార్ట్ చేస్తాడు. ఈ సినిమా గురించి త‌న తాజా ఇంట‌ర్వ్యూలో అనిల్ మాట్లాడాడు.
బాల‌కృష్ణ గారితో తాను చేసే సినిమా చాలా సంచ‌ల‌నాత్మ‌కంగా ఉంటుంద‌ని.. ఈ సినిమా అటు బాల‌కృష్ణ గారితో పాటు ఇటు నాకు ఈ స్క్రిఫ్ట్‌పై వ‌ర్క్ స్టార్ట్ చేయాల‌ని చాలా ఎగ్జైట్‌మెంట్‌గా ఉంద‌ని అనిల్ చెప్పాడు.

ఇక ఇండ‌స్ట్రీ టాక్ ప్ర‌కారం ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాలో బాల‌య్య‌ను ఎవ్వ‌రూ చూపించ‌ని విధంగా చాలా కొత్త‌గా చూపించ‌బోతున్నాడ‌ట‌. గ‌తంలో పైసా వ‌సూల్ సినిమాలో పూరి మేకింగ్‌లో బాల‌య్య చాలా కొత్త‌గా క‌నిపించాడు. ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా త‌న‌దైన మేకింగ్‌లో బాల‌య్య‌ను చాలా కొత్త‌గా చూపించ‌బోతున్నాడ‌ట‌. ఏదేమైనా ఈ సినిమా కొత్త‌గా ఉంటుంద‌న్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news