Moviesమ‌హేష్‌బాబు పిన్నిగా బాల‌య్య మ‌ర‌ద‌లు...!

మ‌హేష్‌బాబు పిన్నిగా బాల‌య్య మ‌ర‌ద‌లు…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్ర‌స్తుతం ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో క‌ళావ‌తి సాంగ్ ఇప్ప‌టికే రిలీజ్ అయ్యి సినీ ప్రేమికుల మ‌న‌స్సుల‌ను దోచేసింది. ఈ సినిమా స‌మ్మ‌ర్ కానుక‌గా మే 12న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో మ‌హేష్‌బాబు సినిమా ఉంటుంది. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్స‌వం కూడా జ‌రుపుకుంది. పూజా హెగ్డే మ‌హేష్‌తో రెండోసారి రొమాన్స్‌కు రెడీ అవుతోంది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన మ‌హ‌ర్షి సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది.

ఇదిలా ఉంటే త్రివిక్ర‌మ్ సినిమాల్లో సీనియ‌ర్ హీరోయిన్ల‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తాడో తెలిసిందే. న‌దియా, ఖుష్బూ, ట‌బు ఇలా సీనియ‌ర్ హీరోయిన్ల‌ను గ్రాండ్‌గా చూపించ‌డంతో పాటు వారికి కూడా హీరోతో స‌మాన‌మైన పాత్ర‌లు ఉండేలా చేసి.. ఆ పాత్ర‌తో వారికి తిరుగులేని లైఫ్ ఇవ్వ‌డంలో త్రివిక్ర‌మ్‌కు త్రివిక్ర‌మే సాటి. తాజాగా మ‌హేష్‌బాబుతో చేస్తోన్న సినిమాలో కూడా త్రివిక్ర‌మ్ మ‌రో సీనియ‌ర్ హీరోయిన్‌ను తెర‌మీద‌కు తీసుకువ‌స్తున్నారు. ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు అల‌నాటి అందాల నాటి శోభ‌న‌.

ఈ సినిమాలో శోభ‌న‌ది మ‌హేష్‌కు పిన్ని పాత్ర‌. శోభ‌న ఒక‌ప్పుడు సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్‌. తెలుగు, త‌మిళంతో పాటు ఆమె సొంత భాష మ‌ళ‌యాళంలోనూ స్టార్ హీరోల‌తో ఎన్నో హిట్ సినిమాలు చేసింది. సినిమాల‌కు దూరం అయ్యాక కూడా పెళ్లి చేసుకోకుండా భ‌ర‌త‌నాట్యం శిక్ష‌ణ ఇస్తోంది. భ‌ర‌త‌నాట్యంలో శోభ‌న‌కు తిరుగులేని ప‌ట్టు ఉంది. అందుకే ఆమె ఎంతో మంది శిష్యుల‌ను త‌యారు చేస్తున్నారు. తెలుగులో కూడా ఆమె చిరంజీవి స‌ర‌స‌న రౌడీ అల్లుడు, బాల‌య్య ప‌క్క‌న నారినారి న‌డుమ మురారి సినిమాలో బాల‌య్య మ‌ర‌ద‌లిగా, మోహ‌న్‌బాబు ప‌క్క‌న రౌడీగారి పెళ్లాం, అల్లుడుగారు లాంటి హిట్ సినిమాలు చేసింది.

ముందుగా మ‌హేష్‌పై ఓ సోలో ఫైట్‌తో పాటు సాంగ్‌ను షూట్ చేస్తార‌ట‌. ఆ త‌ర్వాత రెగ్యుల‌ర్‌షూటింగ్ స్టార్ట్ అవుతుంది. పదకొండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు నెల‌కొన్నాయి. వీరి కాంబోలో 2010లో చివ‌రి సారిగా ఖలేజా సినిమా వ‌చ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news