Moviesబాల‌కృష్ణ - నాగార్జున‌.. ఈ అరుదైన ఫొటోకు ఉన్న స్పెషాలిటీ ఇదే..!

బాల‌కృష్ణ – నాగార్జున‌.. ఈ అరుదైన ఫొటోకు ఉన్న స్పెషాలిటీ ఇదే..!

టాలీవుడ్‌లో నంద‌మూరి, అక్కినేని ఫ్యామిలీల‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. తెలుగు సినిమా చ‌రిత్ర పుట్టిన కొద్ది యేళ్ల నుంచే ప్రారంభ‌మైన ఈ రెండు కుటుంబాల సినీ ప్ర‌స్థానం ఏడు ద‌శాబ్దాలుగా అప్ర‌తిహ‌తంగా కొన‌సాగుతూ మూడో త‌రంలో కూడా కంటిన్యూ అవుతున్నారు. దివంగ‌త ఎన్టీఆర్‌, ఏఎన్నార్ త‌ర్వాత వారి వార‌సులుగా బాల‌కృష్ణ‌, నాగార్జున 1980వ ద‌శ‌కంలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వీరిద్ద‌రు కూడా నాలుగు ద‌శాబ్దాలుగా హీరోలుగా కంటిన్యూ అవుతూ.. ఇప్ప‌ట‌కీ ఇండ‌స్ట్రీలో ఉంటూ త‌మ సీనియార్టీ నిలుపుకుంటున్నారు.

ఇక వీరిలో నాగార్జున ఇద్ద‌రు వార‌సులు ఇప్ప‌టికే హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. బాల‌య్య త‌న‌యుడు మోక్ష‌జ్ఞ సైతం త్వ‌ర‌లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. కార‌ణాలు ఏవైనా బ‌య‌ట బాల‌య్య‌, నాగార్జున క‌లిసి క‌నిపించ‌రు. అయితే గ‌తంలో వీరు ఎన్టీఆర్ – ఏఎన్నార్‌లాగా ఎప్ప‌టిక‌ప్పుడు క‌నిపించేవారు. గ‌త కొన్నేళ్లుగా బాల‌య్య – నాగార్జున మ‌ధ్య ఏదో తెలియ‌ని దూరం అయితే కంటిన్యూ అవుతోంది.

సుబ్బ‌రామిరెడ్డి ఫంక్ష‌న్లో నాగార్జున మాట్లాడుతూ బాల‌య్య‌కు త‌న‌కు మ‌ధ్య ఏదో గ్యాప్ ఉంద‌న్న ప్ర‌చారం అవాస్త‌వ‌మే అంటూ బాల‌య్య చేతిలో చేయి వేసి మ‌రీ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే పైన ఉన్న ఫొటోలో బాల‌య్య – నాగార్జున ఇద్ద‌రూ మాంచి ఉత్సాహంతో ఉన్నారు. ఇది 25 ఏళ్ల క్రితం తీసిన ఫొటో. ఈ సినిమా ఏఎన్నార్ – బాల‌య్య క‌లిసి న‌టించిన గాండీవం సినిమా షూటింగ్ ప్రారంభోత్స‌వం రోజు తీసిన ఫొటో. 1994లో ఈ సినిమా వ‌చ్చింది.

ఈ సినిమాలో చ‌క్ర‌వ‌ర్తిగా అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, రాజాగా బాల‌కృష్ణ‌, రోజాగా రోజా, వీర పెంట‌య్య‌గా ముఖేష్ రుషి, స‌ర్వారాయుడిగా అల్లు రామ‌లింగ‌య్య‌, రాంబాబుగా బ్ర‌హ్మానందం న‌టించారు. శ్రీ ల‌క్ష్మి న‌ర‌సింహా కంబైన్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కిన ఈ సినిమాకు మ‌ళ‌యాళ ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు – బాల‌కృష్ణ కాంబినేష‌న్లో వ‌చ్చిన రెండో సినిమా గాండీవం. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ ఒక పాటలో కనిపిస్తారు. అలాగే గోరువంక వాలగానె గోపురానికి పాట అప్ప‌ట్లో ఓ ఊపు ఊపేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news