Moviesకళ్లు చెదిరే ధరకు అమ్ముడైన 'లైగర్‌' డిజిటల్ రైట్స్‌..విజయ్ దేవరకొండ సెన్సేషనల్...

కళ్లు చెదిరే ధరకు అమ్ముడైన ‘లైగర్‌’ డిజిటల్ రైట్స్‌..విజయ్ దేవరకొండ సెన్సేషనల్ రికార్డు..

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా – బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా..పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుమ్న్న మూవీ లైగర్. ఈ సినిమా టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనదైన స్టైల్లో విభిన్న రీతిలో తెరకెక్కిస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా వ‌స్తోన్న ఈ సినిమాను ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్‌, పూరి క‌నెక్ట్స్ ప‌తాకంపై క‌ర‌ణ్ జోహ‌ర్‌-పూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సిన‌మాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు.

ఇక విజయ్ కి తెలుగు తో పాటు హిందీ లోను మంచి పాపులార్టీ ఉండడం తో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కామ్ డిస్ట్రబ్యూటర్ కరణ్ జోహార్ హిందీ లో రిలీజ్ చేయబోతున్నాడు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసిన చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించారు. ఈ చిత్రం ఆగ‌స్టు 25న విడుద‌ల కానుంది. ఇక రిలీజ్ అవుతున్న పిక్స్ బట్టి..లీక్ అవుతున్న సమాచారం ఆధారంగా లైగర్ సినమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ప్రీ రిలీజ్ బిజినెస్, నాన్ థియెట్రికల్ బిజినెస్ లెక్కలు చూస్తుంటే స్టార్ హీరోలకి కూడా కళ్లు బైర్లు గమ్ముతున్నాయి. ఎందుకంటే విజయ్ దేవరకొండాకి వరసగా రెండు ఫ్లాప్ సినిమాలు పడ్డాయి..అయినా కానీ విజయ్ మార్కెట్ ఇంత కూడా ఎఫెక్ట్ కాలేదు.


తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నుంచి భారీ ఆఫర్‌ దక్కినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను చేజిక్కించుకుందని సమాచారం. మొత్తంగా అన్ని భారతీయ భాషల డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా 60 కోట్ల రూపాయల డీల్ మాట్లాడుకున్నారట.

ఇదే నిజమైతే విజయ్‌ కెరీర్‌లో రికార్డు స్థాయిలో కుదరిన డీల్‌ ఇదేనని చెప్పొచ్చు. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది. ఇది నిజంగా లైగర్ టీం పడ్డ కష్టానికి ప్రతిఫలం అనే అంటున్నారు విజయ్ అభిమానులు. ఇక ఈ డీల్ ఓకే అయితే అటు విజయ్ దేవరకొండ, ఇటు పూరీ జగన్నాథ్ ఇద్దరి కెరీర్ లోనే ఇదే బిగ్గెస్ట్ డిజిటల్ డీల్ అవుతుందనడంలో డౌటే లేదంటున్నారు ఆయన ఫ్యాన్స్. ప్ర‌స్తుతం ఇదే కాంబోలో జ‌న‌గ‌ణ‌మ‌న తెర‌కెక్క‌నుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయ‌ని టాక్ వినబడుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news