Moviesఅబ్బా..ఏం లక్ సమంత..మరో క్రేజీ ఆఫర్ పట్టేసిందిగా..?

అబ్బా..ఏం లక్ సమంత..మరో క్రేజీ ఆఫర్ పట్టేసిందిగా..?

సమంత..తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కానీ..తప్పు అయితే చేసేసింది. ఇక ఏం అనుకున్నా ఏం లాభం లేదు. నాగచైతన్య కు విడాకులు ఇచ్చిన తరువాత సమంత తిరిగి తన కెరీర్ పై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. మనం బాగా గమనించిన్నత్లైతే విడాకుల ప్రకటన అనంతరం సామ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. చాలా డల్ అయిపోయింది. ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు అన్నట్లుగా ఉండేది. కానీ ఇలా సైలెంట్ అయితే పని కాదు అనుకుందో ఏమో తెలియదు కానీ..ఉన్నపలంగా వచ్చిన ఆఫర్స్ అన్నింటిని ఓకే చేసింది.

ఈ క్రమంలోనే పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసి సినిమాకి భారీ హైప్ ను క్రియేట్ చేయడమే కాకుండా..వరల్డ్ నెం 1 సాంగ్ గా యూట్యూబ్ లో సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేసిన ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా..తన పని తాను చేసుకుంటూపోతుంది. ఈ క్రమంలోనే సమంత ..మరో క్రేజీ ఆఫర్ ను అందుకున్నట్లు తెలుస్తుంది. స్టార్ హీరో మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది అంటూ నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ఇకపొతే.. సమంత, మహేష్ బాబుతో మూడు సార్లు జత కట్టింది. ‘దూకుడు’ , ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ ,బ్రహ్మోత్సవం.. సినిమాలు చేయగా..అమదులో రెండు సూపర్ హిట్ కాగా మరోకటి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇక త్రివిక్రమ్ కాంబినేషన్ లో కూడా ఆమె సినిమాలు చేసి హిట్ కొట్టింది. దీంతో ఇద్దరికి లక్కి హీరోయిన్ గా ఉన్న సమంత ను మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

ఇదే కానీ నిజం అయితే సమంత దూకుడును ఎవరు ఆపలేరని ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. నిజానికి ఫస్ట్ ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నీ అనుకున్నారట. కానీ ప్రస్తుతం పూజా హెగ్డే డేట్లు సరిపోక పోవటంతో పాటు.. ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో… హీరోయిన్ పాత్రలో సమంతాని తీసుకోవడానికి… త్రివిక్రమ్, మహేష్ డిసైడ్ అయినట్లు లేటెస్ట్ టాక్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news