Moviesఆ ఒక్క మాటతో అభిమానులని తీవ్రంగా బాధపెట్టిన రాజమౌళి..!!

ఆ ఒక్క మాటతో అభిమానులని తీవ్రంగా బాధపెట్టిన రాజమౌళి..!!

రాజమౌళి..ఈ పేరు తెలియని తెలుగువారంటూ ఉండరు. ఇక ఆయన పేరు ఒక్క సినిమాతోనే ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగేలా చేసుకున్నాడు ఈ జక్కన్న. సినీ కథారచయిత విజయేంద్ర ప్రసాద్ కుమారుడిగా ఇందస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన..ఇప్పుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అనేలా తన పేరును పాపులర్ అయ్యేలా చేసుకున్నాడు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎవరు అంటే కళ్లు మూసుకుని ఎస్ఎస్ రాజమౌళి పేరు చెప్పేస్తారు అభిమానులు. అలాంతి సినిమాలను మనకు ఆయన అందించారు.

ఎప్పుడూ చెక్కుచెదరని నవ్వుతో కొత్త ఆలోచనలకు రూపమిస్తూ దూసుకుపోయే ఆయన ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా తెరకెక్కించి విడుదలకు రెడీ చేసాడు. ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్ లో మాట్లాడుతూ తన సినిమా రిటైర్మెంట్ గురించి కొన్ని కీలక వ్యాఖలు చేసారు.

మహాభారతం సినిమా తీయాలనేది రాజమౌళి కల. ఎప్పటికైనా అది తెరకెక్కించి తీరాలి అని ఇప్పటికే బోలెడు ఇంటర్వ్యుల్లో చెప్పారు. ఇక ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ ..”మహాభారతం తీసాక నేను రిటర్ అయిపోతా” అంటూ తెలిపారు. అయితే అది ఎప్పుడు తీస్తారు అనే విషయం పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు కానీ.. మహాభారతం తీస్తే ఒక పార్ట్ లో తీయరట.

అనేక పార్టులుగా సినిమా తీసారట. దీనికోసం భారీ ఖర్చు కూడా అవుతుందని రాజమౌళి చెప్తున్నారు. ఒకవేళ మహాభారతం తీస్తే అందులో ఎక్కువగా కొత్తవారిని తీసుకుంటానని అంటున్నారు రాజమౌళి. మహాభారతం సినిమాలో ఒక పాత్రలో రాజమౌళి కూడా కనిపిస్తారట. కాగా, రాజమౌళి అప్పుడే రిటైర్మెంట్ ప్రకటించేస్తున్నారా అంటూ ఆయన అభిమానులు మాత్రం బాధపడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news