Moviesఆ టాలీవుడ్ స్టార్ హీరోతో ఛాన్స్ రిజెక్ట్ చేసిన ర‌ష్మిక‌.. ఏం...

ఆ టాలీవుడ్ స్టార్ హీరోతో ఛాన్స్ రిజెక్ట్ చేసిన ర‌ష్మిక‌.. ఏం జ‌రిగింది…?

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న‌ ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయ్యింది. రష్మిక కన్నడ సినిమా ఇండస్ట్రీలో కిర్రాక్ పార్టీ తో ఒక్కసారిగా పాపులర్ అయింది. ఆ సినిమాతో ఆమెకు అక్కడ తిరుగులేని పాపులారిటీ వచ్చింది. అయితే ఆ తర్వాత ఆమెకు తెలుగులో వరుస పెట్టి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. గీతగోవిందం సినిమా సూపర్ హిట్ అయిన వెంటనే అటు నితిన్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఆ వెంటనే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు … తాజాగా బన్నీ పుష్ప సినిమాల్లోనూ ఆమె హీరోయిన్. ఈ రెండు సినిమాలు సూప‌ర్ హిట్‌.

ఇప్పుడు ఆమె కోసం టాలీవుడ్ స్టార్ హీరోలు, దర్శకులు సైతం క్యూలో ఉండే పరిస్థితి. బన్నీ పక్కన ఆమె నటించిన పుష్ప సినిమాతో ఆమె సౌత్ ఇండియాతో పాటు అటు నార్త్ లోనూ మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. పుష్ప‌తో బన్నీతో పాటు ర‌ష్మికకు బాలీవుడ్లో మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఎవరి నోట విన్న రష్మిక నేషనల్ క్ర‌ష్‌ అని అంటున్నారు. అంతగా రష్మిక పాపులర్ అయిపోయింది. అయితే పుష్ప సూపర్ హిట్ అయినా… టాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు వస్తున్నా… ఆమె టాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.

ఇప్పుడు ఆమె దృష్టంతా బాలీవుడ్ మీదే ఉందని అంటున్నారు. తాజాగా ఒక టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం వస్తే ర‌ష్మిక రిజెక్ట్ చేసిందట. రష్మిక టాలీవుడ్‌లో ఇంకా చాలా మంది స్టార్ హీరోల సరసన నటించాల్సి ఉంది. ఎన్టీఆర్ – ప్రభాస్ – రామ్ చరణ్ లాంటి హీరోల ప‌క్క‌న ఆమె ఇంకా న‌టించ‌లేదు. ఈ టైంలోనే ఆమె బాలీవుడ్ మీద కాన్‌సంట్రేష‌న్ చేసి తెలుగు ఇండ‌స్ట్రీని చిన్న చూపు చూడ‌డంతో ఇక్క‌డ ఆమె ఫ్యాన్స్ నొచ్చుకుంటున్నారు.

గ‌తంలో ఇలియానా కూడా ఇక్క‌డ మాంచి క్రేజ్‌లో ఉండ‌గానే బాలీవుడ్లో వెల‌గాల‌ని.. ఇక్క‌డ మంచి ఛాన్సులు వ‌దులుకుంది. బాలీవుడ్‌లో ఆమెను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోని టైంలో ఆమె తిరిగి ఇక్క‌డ‌కు వ‌చ్చినా అప్ప‌టికే ఇక్క‌డ ఆమె ఫేడ‌వుట్ అయిపోయింది. ఇప్పుడు ర‌ష్మిక ప‌రిస్థితి కూడా అలా కాకూడ‌ద‌ని ఆమె తెలుగు అభిమానులు కోరుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news