Moviesపెళ్లి పై చైతూ ఓపినియన్ ఇదా.. సమంత కు కౌంటర్ వేసాడుగా..?

పెళ్లి పై చైతూ ఓపినియన్ ఇదా.. సమంత కు కౌంటర్ వేసాడుగా..?

టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్ అయిన సెలబ్రిటీ జంట సమంత, అక్కినేని నాగచైతన్య వేరుకుంపటి పెట్టుకునేందుకు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. మేం విడాకులు తీసుకుంటున్నట్టు ఇద్దరు తమ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ప్రకటించారు. ఇక అప్పటి నుండి వీళ్లు మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. అసలు వీళ్ళు ఎందుకు విడిపోయారు..?? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. కొదరు ఏమో సినిమాలని..మరి కొందరు ఏమో ఎఫైర్ అని..ఇంకొందరు ఏమో అమల టార్చర్ భరించలేకనే విడాకులు తీసుకుంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఇక సమంత నాగచైతన్య జంట పెళ్లికి ముందు కన్నా పెళ్లి తరువాత కన్నా కూడా విడిపోయిన తరువాతే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా కనిపిస్తున్నారు. వాళ్ల నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్ వేసిన ఈ జంట మీద వస్తున్న ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. కానీ సోషల్ మీడియాలో ఎన్ని రూమర్స్ వచ్చినప్పటికి.. వాళ్లిద్దరు అవి ఏమి పట్టించుకోకుండా..వాళ్ల పనుల్లో బిజీ అయిపోయారు. నాగ చైతన్య తదుపరి సినిమాల పై ఫోకస్ పెట్టారు. ఇక సమంత కూడా విడాకుల విషయం నుండి భయటపడడానికి వరుస సినిమాలకు సైన్ చేస్తూ.. కెరీర్ ని స్పీడ్ అప్ చేసుకుంటుంది.

ఇక రీసెంట్ గా బంగార్రాజు సినిమా చేస్తున్న చైతన్య ఆ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ విడాకుల పై ఫస్ట్ టైం స్పందించాడు. విడిపోయిన తరువాత తను హ్యాపీ..నేను హ్యాపీ గా ఉన్నాను..విడాకులు మంచి గా జరిగాయి అంటూ సింపుల్ గా చెప్పేసాడు. ఇక చిత్ర ప్రమోషన్స్ లో భాగంగానే జీటీవిలో ఓ ప్రోగ్రాం లో పాల్గోన్న ఆయన ..”డోంట్ మ్యారి బీ హ్యాపీ” అంటూ హుషారుగా పాటలు పాడారు. దీంతో అందరు సమంత కు విడిపోయాకనే చైతన్య హ్యాపీగా ఉన్నాడు..బికినీ ఫోటోలు పెట్టి అక్కినేని ఫ్యాన్స్ కోపం తెప్పించిన సమంతకి..చైతన్య ఈ విధంగా కౌంటర్ వేసారు అని చెప్పుకొస్తున్నారు నెటిజన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news