Moviesబన్నీ అలా చెప్పకపోయుంటే నేను ఆ పాట చేసేదానే కాదు..సంచలన మ్యాటర్...

బన్నీ అలా చెప్పకపోయుంటే నేను ఆ పాట చేసేదానే కాదు..సంచలన మ్యాటర్ లీక్ చేసిన సమంత..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. డిసెంబరు 17న విడుదలై ఎమతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. సినిమా మిక్స్డ్ టాక్ ను సంపాదించుకున్నప్పటికి కలెక్షన్స్ పరంగా మాత్రం బన్నీ ఎక్కడ తగ్గెదేలే అంటూ చెలరేగిపోయాడు. ఇక ఈ సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత తన కెరీర్ లోనే ఎప్పుడు చేయని ఐటెం సాంగ్ చేసి..సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఈ పాటకు సమంత అందం , సింగర్ వాయిస్, చంద్రబోస్ లిరిక్స్, దేవీ ట్యూన్ అన్నీ కరెక్ట్ గా సెట్ అయ్యాయి. దీంతో పాట బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఇప్పుడు ఎక్కడ చూసిన కానీ ‘ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా’ అంటూ పాట పాడుతున్నారు. ఈ పాటలో సమంత ఎక్సలెంట్ స్టెప్స్ .. బన్నీ డ్యాన్సింగ్ స్టైల్‌ బాగా మ్యాచ్ అయ్యాయి. సుకుమార్ – దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌కు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఇక ఈ పాట అంతకు మించి అనేలా ఉంది. ఇక విడాకుల తరువాత సమంత ఇలాంటి పాట చేయడం పెద్ద దుమారమే రేపింది. అస్సలు ఇలాంటి పాట చేయాలి అని ఎలా అనిపించింది అని చాలా మంది అభిమానులు ఆమెను అడిగారు. ఇక వాటికి సమాధానం ఇస్తూ సమంత రీసెంట్ ఇంటర్వ్యుల్లో క్లారిటీ ఇచ్చింది.

ఇంటర్వ్యుల్లో ఆమె మాట్లాడుతూ..” పుష్ప సినిమా లో నేను స్పెషల్‌ సాంగ్‌ చేయడానికి మెయిన్ రీజన్ అల్లు అర్జున్‌. ఫస్ట్ సుకుమార్ నా దగ్గరకి వచ్చి ఈ సాంగ్ గురించి చెప్పిన్నప్పుడు నేను ఒప్పుకోలేదు. స్పెషల్‌ సాంగ్ చేయడానికి ముందు భయపడ్డాను. చేయాలా? వద్దా? అని చాలాసార్లు ఆలోచించాను. ఆ సమయంలో బన్నీ నాకు అండగా నిలిచాడు. ఆ పాటలో నటిస్తే నాకు ఎంత పేరు వస్తుందో కూర్చోబెట్టి నెమ్మదిగా వివరించాడు. దీంతో బన్నీ మాటలు విన్నా తరువాత నన్ను నేను ఫ్రూవ్ చేసుకోవాలి అనుకున్నా హీరోయిన్ గా ఎలాంటి రోల్ నైన చేయగలగాలి అని డిసైడ్ అయ్యి ఈ పాటకు సైన్ చేసా”.. అంటూ చెప్పుకొచ్చింది. ఒక్కవేళ బన్నీ నాకు అండగా లేకుంటే ఈ పాటలో అసలు నటించేదాన్ని కాదని చెప్పింది సామ్‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news