Moviesసమంత విషయంలో ఉపాసన అంత పెద్ద తప్పు చేసిందా..?

సమంత విషయంలో ఉపాసన అంత పెద్ద తప్పు చేసిందా..?

సమంత ఉపానస మధ్య ఉన్న స్నేహం అందరికీ తెలిసిందే. ఎవరికి వారిది ప్రత్యేకమైన దారే అయినా ఇద్దరి మధ్య కొన్ని ఆలోచనలు మాత్రం ఒకే రకంగా ఉంటాయి. ఆరోగ్యం, పౌష్టికాహారం, ఫిట్‌నెస్‌, మహిళా శక్తి వంటి ఎన్నో విషయాల్లో వీరిద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. యువర్‌లైఫ్ అనే మ్యాగజైన్, వెబ్ సైట్‌ను ఉపాసన ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఆ మ్యగజైన్‌కు ఉపసంపాదికురాలిగా సమంతను నియమించింది ఉపాసన. అలా ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది.గత లాక్డౌన్‌లో ఈ ఇద్దరూ కలిసి వంటలు కూడా చేశారు. ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఉపాసన సమంత గురించి తనకున్న అభిప్రాయంపై ఓపెన్‌అప్‌ అయ్యి..పలు ఆసక్తికర విషయాలను పంచుకున్న సంగతి తెలిసిందే..

అయితే ఎన్నో పరసనల్ విషయాలను సైతం షేర్ చేసుకునే వీళ్ళు అతి తక్కువ టైంలోనే మంచి క్లోజ్ ఫ్రెండ్స్ గా మారిపోయారట. ఈ క్రమంలోనే సమంత నాగచైతన్య విడాకుల వ్యవహారంలో ఉపాసన చేసిన కామెంట్స్ మెగా ఫ్యామిలీని షాకింగ్ కు గురి చేసాయట. సమంత డివోర్స్ తర్వాత ఆమెపై ఉపాసన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఉపాసన మొదట నుండి ఆడవాళ్లకు సపోర్ట్ గా మాట్లాడుతుంది అన్న సంగతి తెలిసిందే. ఇక సమంత విడాకుల విషయంలో కూడా “అక్కినేని కుటుంబాని తప్పు .. ఓ అమ్మాయి స్వేఛను బంధించడం..కట్టుబాట్లు పేరుతో అణిచివేయడం సరికాదు అన్నట్లు సమంతకు ఫేవర్ గా మాట్లాడుతూ విడాకులు తీసుకుని మంచి పని చేసింది అని చెప్పుకొచ్చిందట.

ఇక దీని పై నెటిజన్స్ భిన్న విభిన్నంగా స్పందిస్తున్నారు. ఉపాసన ఉన్నది ఉన్నట్లు మొహానే చెప్తారు..పెద్దలు అంటే గౌర్వం అని అనుకున్న అభిమానులకు షాక్ ఇచ్చిన్నట్లైంది. సమంత ఉపాసనకి బెస్ట్ ఫ్రెండ్ నే కావచ్చు..కానీ తప్పు ఎవరి సైడ్ ఉందో తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని అంటున్నారు పలువురు నెటిజన్స్. ఇక రీసెంట్ గా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ విడాకుల వ్యవహారంలో కూడా శ్రీజ ను సపోర్ట్ చేస్తూనే మాట్లాడిందట ఉపాసన. ఇవన్నీ చూస్తుంటే మెగా అభిమానుల్లో కొత్త డౌట్లు పుట్టుకోస్తున్నాయి అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news