Moviesఅయ్య బాబోయ్..అర్ధరాత్రి సమంత ఇంట్లోకి దూరిన ఆ స్టార్ హీరో..!!

అయ్య బాబోయ్..అర్ధరాత్రి సమంత ఇంట్లోకి దూరిన ఆ స్టార్ హీరో..!!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. భర్తతో విడాకులు తీసుకున్న తరువాత పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. చైతు నుంచి విడిపోయాక తన స్నేహితులతో కలిసి విహార యాత్రలు చేస్తున్న ఆమె తాజాగా గోవా బీచ్ లో బికినీ వేసుకుని మరీ యోగా చేసింది. పోనీ చేస్తే చేసుకుంది కదా అనుకుంటే ఆ ఫోటోలు… వీడియోలు కాస్త సోషల్ మిడియాలో పోస్ట్ చేసింది.

ఇక అమ్మడు హాట్ అందాలు చూసి కుర్రాళ్లు తట్టుకుంటారా..అబ్బే అస్సలకి అలాంటి విషయాల్లో కుర్రాళ్లు తగ్గేదేలే అన్నట్లు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో టాప్ ట్రేండింగ్ లో ఉంచారు. ఇక ఈ అమ్మడు స‌మంత విడాకుల త‌ర్వాత త‌న లైఫ్‌ను త‌న‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా ఎంజాయ్ చేస్తోంది. ఆమె వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతోంది. అస‌లు ఆమె గ్లామ‌ర్ షోకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పుష్ప సినిమాలో ఊ అంటావా మావా ఐటెం సాంగ్ చూస్తేనే స‌మంత గ్లామ‌ర్ డోస్‌కు హ‌ద్దులు లేవ‌ని అర్థ‌మ‌వుతోంది.

స్టార్ హీరోయిన్ సమంత… నాగచైతన్య కు విడాకులు ఇచ్చాక మరింత బిజీ అయిపోయింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంత‌లం సినిమా తో పాటు యశోద సినిమాలో కూడా నటిస్తోంది. బాలీవుడ్లో రెండు సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతోంది. మరోవైపు వెబ్ సిరీస్‌ల‌లో బోల్డ్ గా ఉండే పాత్రలో నటించేందుకు కూడా ఓకే చెప్పేసింది. మరోవైపు దర్శక, నిర్మాతలు సైతం లేడీ ఓరియంటెడ్ సినిమాలను తెరకెక్కించాలంటే ఇప్పుడు స‌మంత పెద్ద ఆప్షన్ గా మిగిలింది. ఇక ప‌లు యాడ్స్ లో కూడా న‌టిస్తోంది ఈ భామ‌.

బాలీవుడ్ లో స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి కుర్ కురే చిప్స్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. దీనికి సంబందించిన యాడ్ ఇటీవలే రిలీజ్ అయ్యింది. ఆ వీడియోను సమంత షేర్ చేసింది. అక్షయ్ కుమార్, సమంత ఫస్ట్ కమర్షియల్ యాడ్‌‌లో కనిపించిన ఇద్దరు.. ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తే మరింత బాగుంటుందని అనిపించారు. ఇక యాడ్‌లో అక్షయ్ కుమార్ దొంగగా కనిపించగా.. సమంత తన ఇంట్లోకి చోరీకి వచ్చిన అఖయ్ ని పోలీసులకు పట్టిస్తుంది.

ఈ క్రమంలో తనకు కుర్ కురే స్నాక్ పాకెట్ కనిపించగా అఖ్సయ్ దొంగతనానికి వచ్చానని మర్చిపోయి.. వాటిని తీసుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఇంతలోనే అక్కడకు వచ్చిన సామ్.. ఆ స్నాక్స్‌ ఇచ్చి లవబుల్‌గా మాట్లాడుతూనే అక్షయ్‌ను పోలీసులకు అప్పగించడమే యాడ్. ఇక ఈ యాడ్ ని సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ” సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన హీరో కుర్ కురే దొంగగా మారిపోయాడు. అక్షయ్ కుమార్ ఏంటి ఈ ప్రవర్తన” అంటూ చెప్పుకొచ్చిందిప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news