Moviesచిరంజీవి సినిమాలో ప్రభాస్ బ్యూటీ..ఆ డైరెక్టర్ భలే సెట్ చేసాడుగా..?

చిరంజీవి సినిమాలో ప్రభాస్ బ్యూటీ..ఆ డైరెక్టర్ భలే సెట్ చేసాడుగా..?

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో అనుష్క శెట్టికి ఉండే క్రేజే వేరు. సినిమాల్లో తన పాత్ర కోసం ఎలాంటి డ్రెసూలు వేసినా..నిజ జీవితంలో మాత్రం నిండైన వస్త్రాలు ధరించి చూడచక్కగా కనిపిస్తుంది. ఇక ఆమెను అంద‌రూ క‌లెక్ష‌న్స్ జేజెమ్మ అని.. బాక్సాఫీస్ భాగ‌మ‌తి అని పిలుచుకుంటుంటార‌నే సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్‌కి చెందిన‌ నేటి త‌రం హీరోయిన్స్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు ఓ ఊపు తెచ్చింది అనుష్క శెట్టి అన‌డంలో సందేహం అక్క‌ర్లేదు.

అరుంధ‌తి, భాగ‌మ‌తి చిత్రాలే అందుకు ఉదాహ‌ర‌ణ‌లు. వీటితో పాటు బాహుబ‌లి చిత్రంలో త‌న న‌ట‌న‌తో ఆమె పాత్ర‌కు ప్రాణ ప్ర‌తిష్ట చేశారు. కానీ ఆఈ మగ్య కాలంలో ఆమె హీరోయిన్ గా చేసిన సినిమాలు అని ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. అయితే ఏదో అరా కొరా మేనేజ్ చేసుకుంటూ వ‌స్తున్న అనుష్క నిశ్శ‌బ్దం సినిమా తరువాత అస్సలు కనిపించడమే మానేసింది.

ఇక దీంతో అమ్మడు అందాలు ప్రేక్షకులకు బోర్ కొట్టేసాయని..అనుఖ ఇక సీనియర్ హీరోయిన్ పాత్రలు చేస్తే బెటర్ అనే కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే రీసెంట్ గానే యంగ్ హీరో తో కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నవీన్ పోలిశెట్టి తో కలిసి ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చే సినిమాను ప్లాన్ చేసారు యూవీ క్రియేషన్స్..ఇక అందులో హీరోయిన్ గా అనుష్క నటిస్తుంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..అనుష్క టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పక్కన హీరోయిన్ గా చేయబోతుంది అంతూ ఓ వార్త నెట్టింట హ ల్ చల్ చేస్తుంది.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అలాగే ఆతర్వాత గాడ్ ఫాదర్, భోళాశంకర్, వాల్తేరు వీర్రాజు సినిమాలు చేస్తున్నారు చిరు. ఈ సినిమాల్లో నయనతార, తమన్నా, శ్రుతిహాసన్ హీరోయిన్స్ గా ఫిక్స్ అయ్యారు.

ఇక రీసెంట్ గా వెంకీ కుడుముల తో కొత్త సినిమా ప్రకటించాడు మెగాస్టార్ . ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్క శెట్టి అయితే బాగుంటుంది అనుకున్నారట. దీంతో, ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న అనుష్కను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారట మేకర్స్.ఈ పనిని డైరెక్టర్ వెంకీ కుడుముల బాధ్యతగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కాంబినేషన్లు అభిమానుల అంచనాలను పెంచేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news